రాష్ట్రంలో జగన్ పాలన మరో మూడు నెలలే ఉంటుందని, రూ.వేల కోట్ల ఆదాయం తెచ్చే బడా కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(TDP Leader Nara Lokesh) అసహనం వ్యక్తం చేశారు. మేము సైకో జగన్ అని ఊరికే అనడంలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తోందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(CM YS Jaganmohan Reddy)పై x(ట్విట్టర్) వేదికగా నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ను ఉద్దేశిస్తూ.. ‘అమరావతిలో సెక్రటేరియట్ టీడీపీ ప్రభుత్వం కట్టింది అందులో కూర్చుని ఇదేం రాజధాని అంటావు. విశాఖని రాజధాని చేస్తానంటావు. కోర్టుల ఆదేశాలున్నా వ్యవస్థలను బెదిరించి దొడ్డిదారిన ప్రభుత్వ కార్యాలయాల్ని తరలించేందుకు జీవోలు ఇప్పిస్తావు.’ అంటూ మండిపడ్డారు.
అదేవిధంగా ‘ఐటీ డెవలప్మెంట్ కోసం టీడీపీ సర్కారు కట్టిన మిలీనియం టవర్స్‌ను ఖాళీ చేయిస్తావు. వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీలని పక్క రాష్ట్రాలకు తరిమేస్తావు’ అంటూ లోకేశ్ ఆరోపించారు. అదేవిధంగా ‘వేలాది మందికి ఉద్యోగాలు లేకుండా చేసి రుషికొండని ధ్వంసం చేశావు.’ అని ఆరోపించారు.
‘కైలాసగిరిని నాశనం చేశావు. విశాఖని విధ్వంసం చేసి ఆ శిథిలాలపై కూర్చుని ఏం చేస్తావు సైకో జగన్! ఇంత చేస్తే.. నీ పాలన ఎక్స్పైరీ డేట్ 3 నెలలు. మూడు నెలల నీ ముచ్చట ప్రజల సొమ్ము వేలకోట్లు తగలేస్తున్నావంటే నిన్ను సైకో అనే అనాలి’ అంటూ లోకేశ్ ఆరోపించారు.