Telugu News » CM KCR : ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటెయ్యండి!

CM KCR : ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటెయ్యండి!

గతంలో కరెంట్, నీళ్ళు లేక ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పుడా బాధలు లేవని, 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే మనం ఇంకా చాలా బాగా ఉండే వాళ్ళమని తెలిపారు సీఎం. మంచి నీళ్ళ కోసం ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పుడు మిషన్ భగీరథతో ఆ సమస్య లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు.

by admin
BRS Public Meeting In jukkal

– రైతు బీమా చేశాం
– వారం రోజుల్లో రూ.5 లక్షలు అందిస్తాం
– 2 దఫాలుగా రూ.37 వేల కోట్ల రుణమాఫీ చేశాం
– కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడంతో రైతు బంధు ఆపాం
– ఎన్నికలు అవ్వగానే అకౌంట్లలో నగదు వేస్తాం
– దళిత బంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపాం
– మంచీ చెడు చూసి ఆలోచించి ఓటెయ్యండి
– జుక్కల్ సభలో సీఎం కేసీఆర్

రైతు బంధు దుబారా అంటున్న వారికి బుద్ది చెప్పాలన్నారు సీఎం కేసీఆర్ (CM KCR). ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్ (Jukkal) నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. మహారాష్ట్రలో పెద్ద మొత్తంలో ఆదాయం ఉన్నప్పటికీ.. సంక్షేమం లేదన్నారు. అలాగే, కర్ణాటక (Karnataka) లో సరిగ్గా కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. కేవలం 5 గంటల కరెంట్‌ కే గొప్ప అంటున్నారని.. అదే, తెలంగాణలో 24 గంటలు ఇస్తున్నామని చెప్పారు. రైతు బీమా చేశామని, బాధితులకు వారం రోజుల్లో రూ.5 లక్షలు అందిస్తున్నామని, అదేవిధంగా రెండు దఫాలుగా రూ.37 వేల కోట్ల రుణ మాఫీ చేశామని వివరించారు.

BRS Public Meeting In jukkal

కరువు కాటకాలతో అల్లాడిన జుక్కల్‌ నియోజకవర్గం తెలంగాణ ఏర్పడిన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని కేసీఆర్‌ అన్నారు. నియోజకవర్గానికి లెండి ప్రాజెక్టు రావాల్సి ఉన్నదని, ఎన్నికల తర్వాత మహారాష్ట్ర వాళ్లతో మాట్లాడి దాని సంగతి తేలుస్తానని హామీ ఇచ్చారు. నాగమడుగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ను షిండే పట్టుబట్టి మంజూరు చేయించుకున్నారని, దాని ద్వారా వచ్చే వర్షాకాలానికి జుక్కల్‌ లో 40 వేల ఎకరాలకు సాగు నీళ్లు వస్తాయని తెలిపారు. ‘జుక్కల్‌ నియోజకవర్గంలో 25 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నం. ఇప్పుడు తండాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయి. నియోజకవర్గంలో కొత్తగా మూడు మండలాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎన్నికల తర్వాత ఆ పని కూడా పూర్తి చేస్తం’’ అని సీఎం హామీ ఇచ్చారు.

గతంలో కరెంట్, నీళ్ళు లేక ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పుడా బాధలు లేవని, 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే మనం ఇంకా చాలా బాగా ఉండే వాళ్ళమని తెలిపారు సీఎం. మంచి నీళ్ళ కోసం ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పుడు మిషన్ భగీరథతో ఆ సమస్య లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు. మంచీ.. చెడును చూసి ఆలోచించి ఓటెయ్యాలని సూచించారు. దేశంలో దళిత బంధు పథకాన్ని సృష్టించిందే బీఆర్‌ఎస్‌ సర్కార్ అని.. ఆ పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని తెలిపారు. రైతులు స్వయం ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఇది తోడ్పాటును అందిస్తున్నదని చెప్పారు.

కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో రైతు బంధు ఆపామని, ఎన్నికలు అవ్వగానే అకౌంట్లలో నగదు వేస్తామని కేసీఆర్ అన్నారు. గతంలో జుక్కల్‌కు పిల్లనివ్వలంటే భయ పడేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం 3 లక్షల 18 వేలతో అభివృద్ధిలో ముందున్నామన్నారు. తలసరి విద్యుత్ వినియోగం 22 వందల యూనిట్లతో నెంబర్ వన్‌ లో ఉన్నామని వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్.

You may also like

Leave a Comment