తెలంగాణ ‘హస్త’గతమైంది. ఈ ఎన్నికల్లో మొదటి నుంచి బీఆర్ఎస్ (BRS) కు ఎదురుగాలి వీచింది. ఈ ఎన్నికల్లో కామారెడ్డిలో ఏకంగా సీఎం కేసీఆర్ ( CM KCR) ఓడిపోయారంటేనే ఆ పార్టీపై ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో అర్థం అవుతోంది. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకు వెళ్లారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయని తెలిపారు. వరుసగా రెండు సార్లు తమకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు వచ్చిన ఫలితాల గురించి తాము బాధపడటం లేదని వెల్లడించారు.
కానీ తాము ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని అన్నారు. ఈ ఓటమిని పాజిటివ్ గా తీసుకుంటామని తెలిపారు. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని చెప్పారు. త్వరలోనే మళ్లీ తిరిగి పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించినందుకు కాంగ్రెస్ ఆయన అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ కు గుడ్ లక్ అంటూ ట్వీట్ చేశారు. ఇది ఇలా వుంటే సిరిసిల్లలో కేటీఆర్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిరిసిల్ల నుంచి వరుసగా ఇది ఆయనకు ఐదో విజయం కావడం విశేషం. 2009 నుంచి సిరిసిల్ల ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.