Telugu News » BSP : ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థిగా మాయవతి.. షాకిచ్చిన ఆర్‌ఎల్‌డి చీఫ్..!?

BSP : ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థిగా మాయవతి.. షాకిచ్చిన ఆర్‌ఎల్‌డి చీఫ్..!?

భారత కూటమి అధికారంలోకి రావాలన్న.. మోడీకి గట్టి పోటీ ఇవ్వాలన్న.. మాయావతిని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని మలక్ నగర్ అన్నారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే, దేశం మొత్తం ఏకతాటిపైకి వస్తుందని బీఎస్పీ ఎంపీ పేర్కొన్నారు.

by Venu

-ఇండియా కూటమికి బీఎస్పీ కండిషన్..
– బీఎస్పీ పై అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు..

వరుస విజయాలతో ముందుకు వెళ్తున్న బీజేపీ (BJP)ని అడ్డుకునేందుకు విపక్ష పార్టీలు అన్ని కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకొన్న విషయం తెలిసిందే.. అయితే ఈ ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన అభ్యర్థులంతా ప్రధాని పీఠంపై ఆశలు పెట్టుకొన్న వారే అనే టాక్ ఉంది. బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పడ్డ ఇండియా కూటమిలో ఇప్పటికే ఎన్నో లుకలుకలు ఉన్నాయనేది జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మరో పార్టీ ఇండియా కూటమిలో చేరడానికి సిద్దం అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఇండియా కూటమిలో పలు పార్టీలకు చెందిన వారిని సైతం చేర్చుకునే ప్రయత్నాలలో భాగంగా.. బహుజన్ సమాజ్ వాది పార్టీని సైతం భారత్ కూటమిలో జాయిన్ కావాలని నేతలు కొరినట్టు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు స్పందిస్తూ.. బీఎస్పీ చీఫ్ (BSP Chief) మాయవతి (Mayavati)ని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఇండియా కూటమికి కండిషన్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు బీఎస్పీ ఎంపీ మలక్ నగర్ (MP Malak Nagar) మాట్లాడుతూ.. ఇండియా కూటమి నిజంగా బీజేపీని ఓడించాలనుకొంటే.. మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్నారు. లేదంటే బీజేపీని గద్దె దించడం అసాధ్యం అని బీఎస్పీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాలలో సంచలనంగా మారింది.. కాగా మోడీ (Modi)ని అడ్డుకునేందుకు బీఎస్పీతో పొత్తు ఎంతో అవసరం అని తెలిపిన ఎంపీ మలక్ నగర్.. మాయావతికి ఉన్న ఓటు బ్యాంకు ఇండియా కూటమికి ఎంతగానో కలిసి వస్తోందని పేర్కొన్నారు.

భారత కూటమి అధికారంలోకి రావాలన్న.. మోడీకి గట్టి పోటీ ఇవ్వాలన్న.. మాయావతిని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని మలక్ నగర్ అన్నారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే, దేశం మొత్తం ఏకతాటిపైకి వస్తుందని బీఎస్పీ ఎంపీ పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో జరిగిన భారత కూటమి సమావేశంలో అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ పార్టీ ఈ కూటమికి వెలుపల బీఎస్పీతో చర్చలు జరుపుతోందా?.. బీఎస్పీని ఈ కూటమిలోకి తీసుకురావాలని ప్లాన్ వేస్తుందా?.. అనే అనుమానాలు లేవనెత్తారు..

ఆర్‌ఎల్‌డి చీఫ్ జయంత్ చౌదరి కూడా బీఎస్పీ గురించి మాట్లాడుతూ.. బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఇండియా కూటమిలో చేరడం ఇష్టం లేదని మొదటి రోజు నుంచి చెబుతున్నారు.. బలవంతంగా వారిని కూటమిలో చేర్చుకోలేమని వెల్లడించారు. ఇలా ఎవరికి వారే నిర్ణయాలు తీసుకొంటున్న ఇండియా కూటమి వల్ల బీజేపీకి జరిగే నష్టం ఏం లేదనే వాదన సైతం ప్రజల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇండియా కూటమి నవ్వుల పాలవుతోందా? పార్లమెంట్ ఎన్నికల్లో జరిగేది ఇదే అని కొందరు అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment