టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) –జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalian) భేటీకి సంబంధించి వైసీపీ నేతల విమర్శలపై టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న (TDP Leader Budda Venkanna) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కలిస్తే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ-జనసేన భేటీపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే మాట్లాడితే మీకు ’బడితే పూజ తప్పదు’ అని హెచ్చరించారు. మూడు నెలలు ఆగండి.. వాగే వారందరి నోళ్ళు మూతపడతాయని అన్నారు.
కొడాలి నాని లాంటి వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోకపోతే త్వరలోనే బుద్ధి వచ్చేలా టీడీపీ కేడర్ జవాబు చెబుతుందని బుద్ధా వెంకన్న తెలిపారు. ఇప్పటికే లోకేష్ రాసిన రెడ్ డైరీలో కొందరి పేర్లు ఉన్నాయని… మరి కొందరి పేర్లు కూడా ఎక్కుతాయని ఆయన అన్నారు.
కాగా, మూడు నెలలు తరువాత గన్‌మెన్‌లు కూడా ఉండరని బుద్ధా వెంకన్న అన్నారు. వైసీపీ శ్రేణులు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. టీడీపీ, జనసేన పొత్తు ఎప్పుడో కుదిరిందని తెలిపారు. ఆ విషయం తెలుసుకొని మాట్లాడాలని ఆయన స్పష్టం చేశారు.