మాజీ మంత్రి కొడాలి నానిపై (Former Minister Kodali Nani) టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి బుద్దా వెంకన్న (TDP Leader Budda Venkanna) ఫైర్ అయ్యారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క అంటూ వ్యాఖ్యలు చేశారు.
జనవరి 18న ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో సభ పెడుతుంటే ఊరంతా తిరుగుతానని కొడాలి నాని అంటున్నారని.. ఏం చేస్తాడో అని ఇంజెక్షన్లు కొన్నట్లు ఎద్దేవా చేశారు. మరో నలుగురైదుగురికి రేబీస్ ఇంజెక్షన్లు పంపాలన్నారు. డబ్బులు టైట్‌గా ఉన్నాయని చూసుకుని పంపిస్తా అంటూ సెటైర్లు విసిరారు.
ఉషశ్రీ, శంకరనాయక్, కాపు రామచంద్రారెడ్డి, పార్థసారథి లాంటి బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్నారన్నారు. ప్రజల రక్షణ కోసం ఇంజెక్షన్లు కొన్నట్లు చెప్పారు. చంద్రబాబును తిడితే కొడాలి నాని రెండు కాళ్ళూ విరగొట్టి పొయ్యిలో పెడతానని హెచ్చరించారు. మరోవైపు కేశినేని నాని ఆఫీసు బోర్డులపై బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ రైట్స్ తనవి, చంద్రబాబువి అని తెలిపారు.
కనకదుర్గ ఫ్లైఓవర్ తామే పెట్టామని బోర్డులు పెట్టుకుంటే అదంతా అభూతకల్పన అని చెప్పుకొచ్చారు. బస్సు యాత్రలో మొత్తం రెడ్డి సామాజిక వర్గాల వారే ఉన్నారన్నారు. ‘‘నేను బీసీని.. చంద్రబాబుకు బీసీలు కమిట్మెంట్గా ఉంటారు’ అని బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు.