Telugu News » Gujarat : స్వాతంత్ర్యం వచ్చిన ఆ గ్రామానికి రోడ్డు లేదు.. మరి అభివృద్థి అంటే..!?

Gujarat : స్వాతంత్ర్యం వచ్చిన ఆ గ్రామానికి రోడ్డు లేదు.. మరి అభివృద్థి అంటే..!?

నేతల అవినీతిని రాయాలంటే అక్షరాలు సిగ్గుపడుతున్నాయి.. అధికార దాహంతో.. పదవులే పరమావధిగా సాగుతున్న రాజకీయ నాయకులకి ఆదివాసీల కష్టాలు కానరాని తీరాలు అని.. ఆదివాసీల కన్నీళ్ళు చూస్తున్న కాలం ప్రసవ వేదన పడుతుందని ఓ కవి అన్నారు.. ప్రస్తుతం చూస్తున్న కొందరి ఆదివాసీల జీవితాలు ఈ మాటలకి అద్దం పడుతున్నాయని అనిపిస్తుంది..

by Venu

ఏమున్నది గత చరిత్రను తీసుకుంటే.. ఏమున్నది అభివృద్ధిని తలచుకుంటే.. గొప్పల గప్పాలు కొట్టే నాయకుల మాటలకు మారుతుందా బడుగు జీవుల బతుకులు.. అవినీతి అందలమెక్కి, స్వార్థం అధికార పీఠం పై కూర్చుంటే.. దేశంలో ఆకలి కేకలు.. ఆర్తనాదాలు.. భరతమాతకు కడుపుకోత మిగిల్చిన గాయాలు..

నేతల అవినీతిని రాయాలంటే అక్షరాలు సిగ్గుపడుతున్నాయి.. అధికార దాహంతో.. పదవులే పరమావధిగా సాగుతున్న రాజకీయ నాయకులకి ఆదివాసీల కష్టాలు కానరాని తీరాలు అని.. ఆదివాసీల కన్నీళ్ళు చూస్తున్న కాలం ప్రసవ వేదన పడుతుందని ఓ కవి అన్నారు.. ప్రస్తుతం చూస్తున్న కొందరి ఆదివాసీల జీవితాలు ఈ మాటలకి అద్దం పడుతున్నాయని అనిపిస్తుంది..

ఇక ఓ గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రోడ్డు (road) వేయలేదని.. అందువల్ల అభివృద్థికి అందనంత దూరంలో ఆ గ్రామం ఉందని అక్కడి ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల.. ఆపద, అనారోగ్యం వస్తే ప్రాణాల మీద ఆశ వదులుకోవలసిందే అని వాపోతున్నారు. ఇది ఎక్కడో అండమాన్, నికోబార్ వంటి దీవుల్లో ఉన్న గ్రామం కాదండి..

గుజరాత్ (Gujarat)​.. సాబర్​కాంఠా (Sabarkantha)జిల్లా, పోశిన మండలం (Posina Mandal) బుజకర్మాదిపల్లి (Bujakarmadipalli)గ్రామం.. దేశం మొత్తం అభివృద్థితో వెలిగిపోతుందని చాటుతున్న నేతల కళ్ళకు ఇలాంటి కష్టాలు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు ఆదివాసులు.. మరోవైపు ఈ గ్రామంలో ఉన్న ఓ గిరిజన వృద్ధుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 5 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లారు ఇద్దరు యువకులు. రోడ్డు సౌకర్యం కూడా లేని ఈ గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే అంబులెన్స్​ రావడం అతికష్టమే.. అందువల్ల డోలీ కట్టి ఆస్పత్రికి తరలించాల్సిన దుస్థితి ఇక్కడి ఆదివాసులది..

మరోవైపు ఇలాంటి ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో మహారాష్ట్రలో జరిగింది. రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల.. నిండు గర్భిణీని ప్రసవం కోసం 4 కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లారు.. ఇలాంటి ఘటనలు మారుమూలల్లో చోటు చేసుకుంటున్న వెలుగులోకి వచ్చేవి తక్కువే అంటున్నారు కొందరు. మరి అభివృద్థి అంటే? ఏంటనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న..

You may also like

Leave a Comment