Telugu News » Bullet Train: భారత్‌లో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు.. ఫస్ట్ టెర్మినల్ వీడియో వైరల్..!

Bullet Train: భారత్‌లో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు.. ఫస్ట్ టెర్మినల్ వీడియో వైరల్..!

రైల్వే మంత్రి(Ministry of Railways) అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం అతిత్వరలోనే భారతీయులు బుల్లెట్ రైళ్లలో తిరగవచ్చని తెలుస్తోంది. రైల్వే మంత్రి బుల్లెట్ రైలు టెర్మినల్‌కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

by Mano
Bullet Train: Bullet train to run in India.. First terminal video viral..!

భారతీయులు బుల్లెట్ రైళ్ల(Bullet Trains)లో ప్రయాణించే రోజులు ఎంతో దూరంలో లేవు. తాజాగా రైల్వే మంత్రి(Ministry of Railways) అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం అతిత్వరలోనే భారతీయులు బుల్లెట్ రైళ్లలో తిరగవచ్చని తెలుస్తోంది. రైల్వే మంత్రి బుల్లెట్ రైలు టెర్మినల్‌కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Bullet Train: Bullet train to run in India.. First terminal video viral..!

ఈ ఫస్ట్ రైలు టెర్మినల్‌ వీడియోకు ‘భారతదేశం మొదటి బుల్లెట్ రైలు కోసం నిర్మించిన టెర్మినల్’ అని అశ్వినీ వైష్ణవ్ రాసుకొచ్చారు. దీని ద్వారా భారతీయ సంస్కృతి, ఆధునికత కలయికగా ఈ బుల్లెట్ రైలును తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 2022-2023 నాటికి బుల్లెట్ రైలు ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. సబర్మతి మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ వీడియోను రైల్వే మంత్రి వైష్ణవ్ విడుదల చేశారు.

దాదాపు 43 సెకన్ల ఈ వీడియోలో టెర్మినల్లో చేర్చబడిన అనేక ఫీచర్లు, ఆధునికతను చూపించారు. మరోవైపు, భారత ప్రభుత్వం హై స్పీడ్ రైలు అంటే హెచ్ఎస్ఆర్‌ను ప్లాన్ చేస్తోంది. ఇందులోభాగంగా ఆరు అదనపు కారిడార్లకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. వీటిలో ఢిల్లీ నుంచి వారణాసి, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్, ముంబై నుంచి నాగ్పూర్, ముంబై నుంచి హైదరాబాద్, చెన్నె నుంచి మైసూర్, ఢిల్లీ నుంచి అమృతసర్ ఉన్నాయి.

ఇక బుల్లెట్ రైలు విషయానికి వస్తే భారత్‌లో ఈ రైలుకు 2017 సంవత్సరంలో పునాది వేశారు. అప్పటి రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకారం.. ప్రాజెక్టు అంచనా వ్యయం – రూ. 1,08,000 కోట్లు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 81 శాతం జపాన్ ప్రభుత్వం రుణంగా అందించింది. 0.1 శాతం వడ్డీ రేటుతో ఈ లోన్ 15 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ 50 సంవత్సరాలలో తిరిగి చెల్లించబడుతుంది.

ఈ రైలు ముంబై – అహ్మదాబాద్ స్టేషన్లను కలుపుతుంది. సబర్మతి- ముంబై (508 కి.మీ) మధ్య రైల్వే ట్రాక్ భూమిపై నిర్మించిన స్తంభాలపై ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రయాణ సమయం 2.07 గంటలు. రైలు మార్గంలో అన్ని స్టేషన్లలో ఆగితే ప్రయాణం 2.58 గంటలు పడుతుంది. ఇందులో 12 స్టేషన్లు ఉంటాయి. గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు, ఆపరేటింగ్ వేగం గంటకు 320కిలోమీటర్లు.

You may also like

Leave a Comment