తెలంగాణ (Telangana)లో జరిగే ఎన్నికలలో భాగంగా విరామం లేకుండా వరుస పర్యటనలతో దూసుకుపోతున్నారు గులాబీ బాస్ సీఎం కేసీఆర్ (CM KCR).. మూడోసారి తెలంగాణ అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతూ.. హ్యాట్రిక్ (Ahattrick)సాధించాలానే ఆరాటం నేతల ముఖాల్లో కనిపిస్తుందని అంతా అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది.

మరోవైపు అస్లాంకు బుల్లెట్లు ఎక్కడి నుండి వచ్చాయి.. అతను వాటితో సభకు ఎందుకు హాజరయ్యాడని కూపీలాగే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈమేరకు అస్లాం కర్ణాటకకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
ఇక ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తున్న బీఆర్ఎస్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలు ఏమైనా హెచ్చరిస్తున్న అపశకునాలా? అనే అనుమానాలు మెదడులో పుడుతున్నట్టు చర్చించుకుంటున్నారు..