Telugu News » Bus Accident: బస్సు ప్రయాణీకులను కాపాడిన లారీ

Bus Accident: బస్సు ప్రయాణీకులను కాపాడిన లారీ

బ్రేకులు వేసేందుకు డ్రైవర్ ప్రయత్నించినప్పటికీ...బ్రేకులు పడలేదు. బస్సు రోడ్డు కింద వైపు వెళ్లిపోతున్న సమయంలో...ఆ వైపుగా వస్తున్న నవత ట్రాన్స్ పోర్టు లారీ ఆ బస్సుని ఢీ కొట్టింది.

by Prasanna
srisailam bus accident

ఓ బస్సుకు బ్రేకులు (Break Fail) ఫెయిలయ్యాయి. పెద్ద ప్రమాదం (Accident) జరిగి బస్సులోని ప్రయాణీకులు (Passengers) ప్రాణాలు పొగొట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ అప్పుడు ఆ మార్గంలో వచ్చిన ఒక లారీ ఆ బస్సుని, బస్పులోని ప్రయాణీకులను కాపాడింది. లారీ బస్సుని కాపాడటమేంటని అనుకుంటున్నారా! ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

srisailam bus accident

శ్రీశైలం నుంచి తెలంగాణాలోని మునుగోడుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు పెట్టూరువారిపాలెం, ఉప్పలపాడు మధ్య బ్రేకులు ఫైలయ్యాయి. బ్రేకులు వేసేందుకు డ్రైవర్ ప్రయత్నించినప్పటికీ…బ్రేకులు పడలేదు. బస్సు రోడ్డు కింద వైపు వెళ్లిపోతున్న సమయంలో…ఆ వైపుగా వస్తున్న నవత ట్రాన్స్ పోర్టు లారీ ఆ బస్సుని ఢీ కొట్టింది.

ఆ బస్సు అక్కడికక్కడే ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే బస్సు రోడ్డు సైడ్ కు దూసుకుపోయి ఏ చెట్టునో ఢీ కొంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెప్తున్నారు.

నవతా ట్రాన్స్ పోర్ట్ లారీ భగవంతుని రూపంలో వచ్చి బస్సును ఢీకొనడంతో తమ ప్రాణాలు కాపాడినట్లైయ్యిందని బస్సు ప్రయాణీకులు చెప్పున్నారు. ఇటు లారీ, అటు బస్సు సిబ్బందికి కానీ, ప్రయాణీకులకు కానీ ఎటువంటి గాయాలు కాలేదు. లారీ ముందు భాగం మాత్రం కొంతమేర దెబ్బతింది. ప్రమాదం నుండి అందరూ క్షేమంగా బయటపడటంతో తమ తమ గమ్య స్థానాలకు ప్రయాణీకులు వెళ్ళిపోయారు.

You may also like

Leave a Comment