ఆటో సెగ్మెంట్ దిగ్గజం మహీంద్రా గ్రూప్(Mahindra Group) విమాన తయారీ(Aircraft manufacturing) రంగంలోకి అడుగుపెట్టనుంది. భారత వైమానిక దళం మీడియం ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ (MTA) అవసరమని భావించింది. దీన్ని అర్థం చేసుకున్న మహీంద్రా.. బ్రెజిలియన్ కంపెనీ ఎంబ్రేయర్(Brazilian company Embraer)తో కలిసి సి 390 మిలీనియం విమానాల(C 390 Air croft) తయారీ చేపట్టనుంది.
ప్రస్తుతం, భారతదేశంలో ఇలాంటి 800 వరకు హెలికాప్టర్లకు తక్షణ డిమాండ్ ఉంది. C-390 బ్రెజిలియన్ వైమానిక దళం ఉపయోగిస్తుంది. దీని తరువాత, దీనిని పోర్చుగల్, హంగరీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, దక్షిణ కొరియా సైన్యాలు కూడా కొనుగోలు చేశాయి. ఎంబ్రేయర్ ఇంతకుముందు డీఆర్డీవో, బీఎస్ఎఫ్ భారత ప్రభుత్వానికి అనేక రకాల విమానాలను అందించింది.
ఈ నేపథ్యంలో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఎయిర్‌ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా బ్రెజిలియన్ కంపెనీ ఎంబ్రేయర్‌తో ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు. వైమానిక దళం 18 నుంచి 30 టన్నుల బరువును ఎత్తగలిగే ఎంటీఏ కోసం వెతుకుతోంది. ఎంబ్రేయర్ ఫిబ్రవరిలో బెంగళూరులో ఈ C-390 మిలీనియం మల్టీ మిషన్ టాక్టికల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రదర్శించింది.
ఇటీవల టాటా గ్రూప్ H125 సింగిల్ ఇంజన్ హెలికాప్టర్‌ను తయారు చేయడానికి విమానాల తయారీ కంపెనీ ఎయిర్ బస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం, వడోదరలో ఉన్న అసెంబ్లీ లైన్‌లో 40 C295 రవాణా విమానాలను కూడాతయారు చేస్తారు. ఇక్కడ తయారైన హెచ్ 125 హెలికాప్టర్లను కూడా ఎగుమతి చేస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు.