Telugu News » CAA: వారంలో దేశమంతా కొత్త చట్టం అమలు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన..!

CAA: వారంలో దేశమంతా కొత్త చట్టం అమలు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన..!

కేంద్రమంత్రి శంతను ఠాకూర్(Shantanu Thakur) కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమల్లోకి వస్తుందని తెలిపారు.

by Mano
CAA: Implementation of the new law in the whole country in a week.. Union Minister's key announcement..!

కేంద్రమంత్రి, బీజేపీ నేత(Union Minister and BJP leader) శంతను ఠాకూర్(Shantanu Thakur) కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమల్లోకి వస్తుందని తెలిపారు. బెంగాల్‌(Bengal)లోని దక్షిణ 24 పరగణాస్‌(Parganas)లోని క్వప్ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

CAA: Implementation of the new law in the whole country in a week.. Union Minister's key announcement..!

2019లో పార్లమెంట్ రెండు సభల్లో సీఏఏ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం తర్వాత భారత్ అంతటా దీనిపై వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, సీఏఏ కోసం కేంద్రం ఇంకా నిబంధనలు రూపొందించకపోవడంతో చట్టం అమలు ఆలస్యమవుతోంది.

ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్‌లో కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో అమిత్‌షా ప్రసంగిస్తూ.. ‘రాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్లోనే కాదు, భారత్ అంతటా సీఏఏ అమలు చేయబడుతుంది.. వివాదాస్పద పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ)ని అమలు చేయడాన్ని ఎవరూ ఆపలేరు..’ అని అన్నారు.

ముఖ్యంగా బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సీఏఏను గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా  చొరబాటు, అవినీతి, రాజకీయ హింస, బుజ్జగింపు రాజకీయాలను ఉద్దేశిస్తూ మమతా బెనర్జీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో ఆమె ప్రభుత్వాన్ని గద్దె దించి 2026లో బీజేపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే శంతను ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.

You may also like

Leave a Comment