Telugu News » Hyderabad : హైదరాబాద్ లో మితిమీరిన పబ్స్ ఆగడాలు

Hyderabad : హైదరాబాద్ లో మితిమీరిన పబ్స్ ఆగడాలు

పబ్బుల్లో భారీ శబ్దాలతో మ్యూజిక్ పెడుతున్నారని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు పెట్టారు. ముందుగా జూబ్లీహిల్స్‌ పరిధిలోని పబ్బుల్లో తనిఖీలు చేశారు పోలీసులు.

by admin
Cases registered against many pubs

హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో పబ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. సరదాగా మొదలై.. తర్వాత ఇదో వ్యసనంగా యువతకు మారిపోతోంది. ఉద్యోగం వచ్చినా.. బర్త్ డే అయినా.. ఇప్పుడు చాలావరకు పబ్స్ లోనే పార్టీ చేసుకుంటున్నారు. రోజురోజుకీ యువత అట్రాక్ట్ అవుతుండడంతో నగరంలో పబ్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అయితే.. రూల్స్ ను బ్రేక్ చేస్తూ కొన్ని పబ్స్ నిర్వహిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

Cases registered against many pubs

ఇప్పటికే కొన్ని పబ్స్ మాదకద్రవ్యాలకు అడ్డాగా మారాయి. పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నామని చెబుతున్నా.. సరుకు అందాల్సిన వారికి అందుతోంది. ఇదే అదునుగా కొన్ని పబ్స్ మితిమీరి ప్రవర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు కొరఢా ఝులిపించారు. జూబ్లీహిల్స్‌ లో ఆరు పబ్బులపై కేసులు నమోదు చేశారు.

పబ్బుల్లో భారీ శబ్దాలతో మ్యూజిక్ పెడుతున్నారని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు పెట్టారు. ముందుగా జూబ్లీహిల్స్‌ పరిధిలోని పబ్బుల్లో తనిఖీలు చేశారు పోలీసులు. కొన్నిచోట్ల ఎలాంటి లైసెన్స్ లేకుండా భారీ శబ్దాలతో పబ్బులలో మ్యూజిక్ నిర్వహిస్తున్నారని గుర్తించారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 35 క్లబ్ రోగ్ పబ్, రోడ్ నెంబర్ 45లో పోర్టు పబ్, హలో కాక్ టెయిల్, ఫ్యాట్ ఫిజీయన్ పబ్, రోడ్ నెంబర్ 10లోని జీరో 40 పబ్‌ లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కేసులు నమోదైన పబ్బులపై మరోసారి ఫిర్యాదులు వస్తే.. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

You may also like

Leave a Comment