రాజకీయం అంతుచిక్కని అగాధం అంటారు లోకజ్ఞానం తెలిసిన పెద్దలు, రాజకీయంలో తలపండిన నేతలు.. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో..ఎన్నికల సమయంలో ఎవరు పోటీలో ఉంటారో.. ఎందరు కొత్త వారు ఆయా పార్టీల తీర్థం పుచ్చుకొంటారో ఉహించడం కష్టం.
ప్రస్తుతం ఇలాంటి అయోమయంలో ఇప్పటి వరకు ఉన్న వారికి ఒక క్లారిటీ దొరికింది చీకోటి ప్రవీణ్ (Chikoti Praveen) విషయంలో.. ఇప్పటి వరకు ఎవరికీ నచ్చినట్టు వారు రాసిన వార్తలకు బ్రేక్ పడినట్టే.. ఇంతకు అసలు విషయం ఏంటంటే..
క్యాసినో కింగ్ (Casino King) చీకోటి ప్రవీణ్ బీజేపీలో (BJP) చేరుతున్నట్టు.. ఆ సమయంలో ఆయనకు తగిన గుర్తింపు బీజేపీ అధిష్టానం ఇవ్వనట్టు ప్రచారం జరిగింది. ప్రవీణ్, బీజేపీపై కోపంగా ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ హైదరాబాద్‌లోని (Hyderabad) బర్కాత్ పూర్ బీజేపీ ఆఫీస్‌లో శనివారం చికోటి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) కండువా కప్పి చికోటిని పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా, గతంలో చికోటీ ప్రవీణ్, బీజేపీలో చేరేందుకు కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం నుండి అభిమానులు, అనుచరులతో భారీ ర్యాలీగా నాంపల్లి బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ లాస్ట్ మినిట్‌లో చికోటి చేరికకు బ్రేక్ పడింది. ఈ ఘటన తర్వాత చికోటీ తన ఆవేదనను ఓ వీడియో ద్వారా వెళ్లగక్కారు. మరోసారి బీజేపీ పెద్దలతో జరిగిన చర్చలు ఫలించి పార్టీలోకి ఎంట్రీ దొరికింది. ఈ నేపథ్యంలో శనివారం లాంఛనంగా చికోటీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.