Telugu News » CAA : సీఏఏపై కేంద్రం కీలక నిర్ణయం..అందుబాటులోకి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్!

CAA : సీఏఏపై కేంద్రం కీలక నిర్ణయం..అందుబాటులోకి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్!

పౌరసత్వ సవరణ చట్టం(CAA) విషయంలో కేంద్రం మరోక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో సీఏఏ అమలుతో తమకు పౌరసత్వం పోతుందని, తమ హక్కులు హరింపబడతాయని, తమను భారతీయులుగా గుర్తించరని, సంక్షేమ పథకాలకు అర్హులుగా ఇకపై ప్రభుత్వాలు పరిగణించవని భావించే ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలకు కేంద్ర హోంశాఖ శుభవార్త చెప్పింది.

by Sai
Center's key decision on CAA..special helpline number available

సీఏఏ మీద ఎటువంటి అనుమానాలు ఉన్నా, భయాందోళనలు ఉన్నా వాటి నివృత్తి కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ను(Helpline Number) తీసుకొచ్చింది.1032 ఈ నంబర్‌కు కాల్ చేసే ఎటువంటి సందేహాలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం తరఫున స్పష్టమైన సమాచారాన్ని అందించనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ నంబర్ ‌కు కాల్ చేయొచ్చు. సీఏఏకు భారతీయ పౌరులకు ఎటువంటి సంబంధం లేదని, ఈ చట్టం వలన భారతీయ పౌరతస్వం కలిగిన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వం తొలగించబడదని, 2014కు ముందు పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ, జైన్, సిక్కు, పార్శిలు (ఆయా దేశాల్లో వివక్షకు గురైన మైనార్టీలకు) భారత్ లో పౌరసత్వం కల్పిస్తామని కేంద్ర హోమంత్రి అమిత్ షా స్పష్టంచేశారు.

అయితే, మతం ఆధారంగా సీఏఏను తీసుకురావడం ముమ్మాటికీ వివక్షే అని దేశంలోని పలు రాజకీయ పార్టీలు, ఒక వర్గం ప్రజలు, పలువురు మేధావులు కేంద్రం తీరును తప్పుబడుతున్నారు.2019లో ఈ చట్టాన్ని తీసుకొచ్చి కేవలం పార్లమెంట్ ఎన్నికల ముందు అమలుచేయడం ముమ్మాటికీ రాజకీయ లబ్ది కోసమే కేంద్రం చేస్తోందని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.`

You may also like

Leave a Comment