Telugu News » Central Cabinet : కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు.. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం ఆమోదం..

Central Cabinet : కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు.. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం ఆమోదం..

ఈ ప్రాజెక్టు మార్చి 2029 నాటికి పూర్తవుతుందన్న కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.. లజపత్ నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్, ఇందర్ లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకూ వీటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు..

by Venu
Delhi metro

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ (BJP) సర్కార్‌ ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్‌ (Central Cabinet) కీలక నిర్ణయం తీసుకొంది. కేబినెట్‌ భేటీ అనంతరం ఢిల్లీ (Delhi)లో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, మీడియాకు కేటినెట్‌ నిర్ణయాలకు వెల్లడించారు.

ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు వివరించారు. అదనంగా 20 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కు కేబినెట్ ఆమోదం లభించిందని అన్నారు.. ఢిల్లీ మెట్రో ఫేజ్ IV ప్రాజెక్టుల రెండు కారిడార్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur).. ఈ రెండు కారిడార్లకు 8,399 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు.

అలాగే ఈ రెండు కారిడార్ల దూరం 20.762 కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు..మరోవైపు ఈ ప్రాజెక్టు మార్చి 2029 నాటికి పూర్తవుతుందన్న కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.. లజపత్ నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్, ఇందర్ లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకూ వీటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.. ఈ కొత్త మెట్రో లైన్ సిల్వర్, మెజెంటా, పింక్ వైలెట్ లైన్లను కనెక్ట్ చేయనుందన్నారు. మొత్తం 8 స్టేషన్లను నిర్మించనుండగా.. ఇందర్ లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకూ 12.377 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ ఉండనుందని పేర్కొన్నారు..

You may also like

Leave a Comment