Telugu News » Champai Soren: హైడ్రామాకు తెర.. ఝార్ఖండ్‌ సీఎంగా చంపై సోరెన్‌ బాధ్యతలు స్వీకరణ..!

Champai Soren: హైడ్రామాకు తెర.. ఝార్ఖండ్‌ సీఎంగా చంపై సోరెన్‌ బాధ్యతలు స్వీకరణ..!

ఝార్ఖండ్‌(Jharkhand)లో రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అధికార జేఎంఎం (JMM) కూటమి శాసనసభాపక్ష నేత చంపై సోరెన్‌ (Champai Soren) ఝార్ఖండ్‌ తదుపరి ముఖ్యమంత్రిగా (Chief Minister) బాధ్యతలు స్వీకరించారు.

by Mano
Champai Soren: Curtain for Hydra.. Champai Soren takes charge as CM of Jharkhand..!

ఝార్ఖండ్‌(Jharkhand)లో రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అధికార జేఎంఎం (JMM) కూటమి శాసనసభాపక్ష నేత చంపై సోరెన్‌ (Champai Soren) ఝార్ఖండ్‌ తదుపరి ముఖ్యమంత్రిగా (Chief Minister) బాధ్యతలు స్వీకరించారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో శుక్రవారం గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌.. చంపైతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Champai Soren: Curtain for Hydra.. Champai Soren takes charge as CM of Jharkhand..!చంపైతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈడీ అరెస్టు నేపథ్యంలో సీఎం పదవికి జేఎంఎం నేత హేమంత్‌ సోరేన్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అధికార సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంపై సొరేన్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన సీఎం పదవి చేపట్టారు. చంపై సోరెన్‌ ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి సెరైకెలా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ప్రస్తుతం కేబినెట్‌ మంత్రిగా హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చంపై తొలిసారిగా 2005లో ఝార్ఖండ్‌ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2009లో ఎమ్మెల్యేగా, 2010 నుంచి జనవరి 2013 వరకు కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

జూలై 2013 నుంచి డిసెంబర్ 2014 పౌర సరఫరాలు, రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో మూడోసారి ఝార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో నాలుగోసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. హేమంత్ సోరెన్‌ ప్రభుత్వంలో రవాణా, సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సీఎం అయ్యారు.

చంపై 1974లో జంషెడ్‌పూర్‌లోని రామకృష్ణ మిషన్‌ హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. బీహార్ నుంచి ప్రత్యేక ఝార్ఖండ్ రాష్ట్రం కోసం డిమాండ్ చేసిన వారిలో చంపై ఒకరు. శిబు సోరెన్‌తో పాటు చంపై సైతం ప్రత్యేక జార్ఖండ్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రజలు ఆయనను ‘జార్ఖండ్‌ టైగర్‌’గా పిలుస్తూ వస్తున్నారు.

 

You may also like

Leave a Comment