Telugu News » Chanakya : కత్తి పట్టకుండా శత్రువులను సంహరించిన అపర మేధావి చాణక్యుడు…!

Chanakya : కత్తి పట్టకుండా శత్రువులను సంహరించిన అపర మేధావి చాణక్యుడు…!

తన చాణక్యంతో శత్రు రాజ్యాలను ముప్పు తిప్పలు పెట్టిన గొప్ప రాజనీతిజ్ఞుడు. వందల ఏండ్ల క్రితమే భారతీయులకు వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్పిన గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆయన.

by Ramu

చాణక్యుడు(Chanakyudu)…. ఓ గొప్ప పండితుడు. కత్తి పట్టకుండా నంద రాజ్యాన్ని (Nanda Kingdom) అంతం చేసిన అపర మేధావి. తన చాణక్యంతో శత్రు రాజ్యాలను ముప్పు తిప్పలు పెట్టిన గొప్ప రాజనీతిజ్ఞుడు. వందల ఏండ్ల క్రితమే భారతీయులకు వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్పిన గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆయన. అర్ధ శాస్త్రంతో మానవులకు ఆర్థిక క్రమశిక్షణ ప్రాధాన్యతను వివరించిన గొప్ప ఆర్థిక వేత్త ఆయన.


చాణక్యుడు ఓ బ్రహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు చణకుడు. తక్షశిల విశ్వ విద్యాలయంలో చిన్నతనంలోనే వేదాలను అవపోసన పట్టారు. జ్యోతిష్య శాస్త్రం, వైద్య శాస్త్రంతో పాటు పలు శాస్త్రాల్లో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. ఆయన తన పాండిత్యంతో పలు దేశాల్లో పండితులను, కవులను ఓడించిన ఎన్నో గొప్ప సత్కారాలు అందుకున్నారు.

ఈ క్రమంలోనే నంద రాజ్యానికి వెళ్లాడు. ఆ రాజ్యంలో తన పాండిత్యాన్ని ప్రదర్శించాలనకున్నాడు. అక్కడ ఓ సింహాసనంపై కూర్చుని ధన నందుని ఆగ్రహానికి చాణక్యుడు గురయ్యారు. చాణక్యున్ని జుట్టుపట్టుకుని బలవంతంగా బయటకు గెంటి వేయాలని అధికారులను రాజు ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన విష్ణుగుప్తుడు ధన నందుని రాజ్యాన్ని నాశనం చేసే వరకు తన జుట్టును ముడి వేయనని చాణక్య శపథం చేశారు.

అనంతరం చంద్రగుప్త మౌర్యుని వద్దకు చాణక్యుడు చేరుకున్నారు. చంద్రగుప్త మౌర్యునితో కలిసి ధననందున్ని అంతం చేయాలని అనుకున్నారు. నెమ్మదిగా చంద్రుగుప్తునితో కలిసి ఓ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ సైన్యాన్ని తన చాణక్యంతో ముందుకు నడుపుతూ చంద్రగుప్తునికి అపూర్వ విజయాలను అందించాడు. చివరకు నంద రాజ్యాన్ని ఆక్రమించి ధననందున్ని చంద్రగుప్తుడు హతమార్చాడు.

You may also like

Leave a Comment