Telugu News » Chandra Mohan Funeral: ఇక సెలవు.. అశ్రునయనాలతో నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు..!

Chandra Mohan Funeral: ఇక సెలవు.. అశ్రునయనాలతో నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు..!

చంద్రమోహన్ పార్థివదేహానికి ఆయన తమ్ముడు మల్లంపల్లి దుర్గాప్రసాద్, పంజాగుట్ట శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రనయనాల మధ్య దిగ్గజ నటుడికి అంతిమ వీడ్కోలు పలికారు.

by Mano
Chandra Mohan Funeral: No more vacation.. Actor Chandra Mohan's last rites with tears..!

టాలీవుడ్ గర్వించదగ్గ ప్రముఖ నటుడు చంద్రమోహన్ (82) ప్రస్థానం ముగిసింది. చంద్రమోహన్ పార్థివదేహానికి ఆయన తమ్ముడు మల్లంపల్లి దుర్గాప్రసాద్, పంజాగుట్ట శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రనయనాల మధ్య దిగ్గజ నటుడికి అంతిమ వీడ్కోలు పలికారు.

Chandra Mohan Funeral: No more vacation.. Actor Chandra Mohan's last rites with tears..!

చంద్రమోహన్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో ఉంచారు. చంద్రమోహన్ మృతి పట్ల యావత్ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 55 ఏళ్ల నుంచీ తెలుగు సినిమాతో కలసి నడుస్తున్న అనుభవం.. కలిపితే చంద్రమోహన్.

‘రంగుల రాట్నం’తో కెరీర్ స్టార్ట్ చేసిన చంద్రమోహన్. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. తన కెరీర్‌లో ఆయన రెండు ఫిలింఫేర్, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ కమెడీయన్గా నంది అవార్డు అందుకున్నారు.

చంద్ర మోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఆయన 1945, మే 23న కృష్ణాజిల్లాలో జన్మించారు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్‌లో డిగ్రీ చేశారు. చంద్రమోహన్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రఖ్యాత దర్శకుడు కే విశ్వనాథ్‌కు కజిన్ అవుతారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నటుడిగా చంద్రమోహన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.

అప్పట్లో చంద్రమోహన్ సరసన హీరోయిన్‌గా చేసిన వారి అదృష్టం కలిసి వస్తుంది అనేవారు. కట్ చేస్తే ఎక్కడికో వెళ్లేది వారి కెరీర్. అంతటి లక్కీ హ్యాండ్ చంద్రమోహన్‌ది అనేవారు. చంద్ర మోహన్‌తో నటించిన తర్వాతే శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, రాధ, విజయశాంతి వంటి ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా రాణించారు. తొలినాళ్లలో ‘కొత్త నీరు’ వంటి చిత్రాలతో సీరియస్ హీరోగా నటించిన చంద్రమోహన్ తర్వాత తన పంథా మార్చుకున్నారు.

‘బంగారు పిచుక’ వంటి సినిమాల నుంచీ ఆయనలోని కామెడీ యాక్టర్ బయటికొచ్చారు.‘గంగ మంగ’ వంటి కొన్ని చిత్రాల్లో విలనిజం చూపించారు. ఆయన మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ఆయన మృతితో సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగింది. హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తన విలక్షణ నటనతో మెప్పించారు చంద్రమోహన్.

 చంద్రమోహన్ నటించిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..

‘బంగారు పిచుక’, ‘ఆదిత్య 369’, ‘పెద్దరికం’, ‘గులాబీ’, ‘రాముడొచ్చాడు’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘ప్రేమించుకుందాం రా’, ‘చంద్రలేఖ’, ‘అందరూ హీరోలే’ ‘ఆత్మీయులు’, ‘తల్లిదండ్రులు’, ‘బొమ్మబొరుసు’, ‘సీతామాలక్ష్మి’, ‘శంకరాభరణం’,’తాయారమ్మ బంగారయ్య’, ‘మూడు ముళ్లు’, ‘చంటబ్బాయ్’, ‘శ్రీ షిరిడీ సాయిబాబా మహాత్యం’, ‘వివాహ భోజనంబు’, ‘త్రినేత్రుడు’, ‘యోగి వేమన’, ‘ఇంటింటి రామాయణం’, ‘కొరికలే గుర్రాలైతే’, ‘మంగళ తోరణాలు’ ‘కొత్తనీరు’, ‘సంతోషిమాత వ్రతం’, లాంటి సినిమాల్లో నటించారు.

You may also like

Leave a Comment