Telugu News » Chandrababu Arrest: బాబు బెయిల్ పిటిషన్ వాయిదా… ఎందుకంటే…!

Chandrababu Arrest: బాబు బెయిల్ పిటిషన్ వాయిదా… ఎందుకంటే…!

మధ్యంతర బెయిల్‌పై విచారిస్తే క్వాష్‌ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

by Prasanna
babu bail

 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandra Babu) బెయిల్‌ పిటిషన్‌ (Bail Petition) విచారణ వాయిదా పడింది. దీనిని 19కి వాయిదా వేస్తున్నట్లు విజయవాడ ఏసీబీ కోర్ట్ (ACB Court) తెలిపింది. ఈలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.

babu bail

చంద్రబాబు మద్యంతర బెయిల్ పిటిషన్ ను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో కూడా కోర్టు చెప్పింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్‌పై విచారిస్తే క్వాష్‌ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో తన పాత్రపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేసిందని బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు చంద్రబాబు.

రాజకీయ కక్షలతోనే దురుద్దేశపూర్వకంగా నన్ను ఈ కేసులోకి లాగారని, సీఎం ప్రోద్బలంతో నన్ను ఇరికించారంటూ పిటిషన్‌లో చంద్రబాబు ప్రస్తావించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర బెయిల్ ఇవ్వండని పిటిషన్‌లో ఆయన కోరారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

దీంతో మళ్లీ చంద్రబాబుకి బెయిల్ వస్తుందా రాదా అనేది తేలాంటే మంగళవారం వరకు వేచి చూడాల్సిందే.

You may also like

Leave a Comment