Telugu News » CBN Arrest:  చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అమెరికాలో ర్యాలీలు

CBN Arrest:  చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అమెరికాలో ర్యాలీలు

స్కిల్​ డెవలప్​మెంట్​ కేసులో అరెస్టైనా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం- జనసేన జెండాలతో ర్యాలీగా తరలి వెళ్లారు.

by Prasanna
tdp NEW JERSTY

చంద్రబాబు (Chandababu)  అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్రంలోనే కాదు విదేశాల్లో తెలుగువారు నివసించే  కొన్ని చోట్ల కూడా  అందోళనలు చేస్తున్నారు. సీబీఎన్ (CBN) కు మద్దతుగా ర్యాలీలు చేపడుతున్నారు. తాజాగా అమెరికాలోని (America) న్యూజెర్సీలో తెలుగు ప్రజలు ర్యాలీ నిర్వహించారు. రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

tdp NEW JERSTY

స్కిల్​ డెవలప్​మెంట్​ కేసులో అరెస్టైనా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం- జనసేన జెండాలతో ర్యాలీగా తరలి వెళ్లారు.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు తీసుకొచ్చిన విద్యా ప్రమాణాల వల్లే తామంతా విదేశాల్లో స్థిరపడ్డామని ఎన్ఆర్ఐలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ ర్యాలీ సందర్భంగా తమకు ‘న్యాయం కావాలి – చంద్రబాబు విడుదల కావాలి’ అనే నినాదాలు చేశారు. సైకో పోవాలి- సైకిల్ రావాలంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. తామంతా చంద్రబాబు వెంట ఉన్నామనీ త్వరలోనే ఆయన బయటకు వస్తారని తెలిపారు.

You may also like

Leave a Comment