Telugu News » Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా..!

Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా..!

ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు(Supreme court) ఈ నెల 30కి వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబును ఫైబర్ నెట్ కేసులో అరెస్ట్ చేయొద్దని సుప్రీం ఆదేశించింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ రిజర్వ్‌లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

by Mano
Chandrababu: Chandrababu's anticipatory bail petition in the Supreme Court.. Hearing postponed..!

ఫైబర్ నెట్ స్కాం కేసు(Fiber Net Scam)లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Nayudu) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు(Supreme court) ఈ నెల 30కి వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబును ఫైబర్ నెట్ కేసులో అరెస్ట్ చేయొద్దని సుప్రీం ఆదేశించింది.

Chandrababu: Chandrababu's anticipatory bail petition in the Supreme Court.. Hearing postponed..!

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ రిజర్వ్‌లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఆరోగ్యకారణాల రీత్యా చంద్రబాబు ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. సుప్రీంకోర్టులో కేసు ముగిసేవరకు అరెస్టు చేయబోమనే నిబంధన కొనసాగించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా కోర్టుకు తెలిపారు.

స్కిల్ స్కాం క్వాష్ పిటిషన్‌లోని కొన్ని అంశాలు ఫైబర్నెట్ కేసుతో ముడిపడి ఉన్నాయని.. క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌పై విచారణ చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. దీపావళి సెలవుల అనంతరం స్కిల్ కేసు తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఈనెల 23లోగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. కేసు కొట్టేయాలంటూ చంద్రబాబు పెట్టుకున్న 17-ఏ పిటిషన్‌పై దీపావళి సెలవుల తర్వాత సుప్రీం తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి.

You may also like

Leave a Comment