Telugu News » Chandrababu: ‘స్కిల్’ కేసులో చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు సీఐడీ..!

Chandrababu: ‘స్కిల్’ కేసులో చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు సీఐడీ..!

చంద్రబాబు(Chandrababu)కు హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ (Regular Bail) మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం తీర్పుపై సీఐడీ సుప్రీం కోర్టు (Supreme Court)కు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

by Mano
Chandrababu

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu)కు హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ (Regular Bail) మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం తీర్పుపై సీఐడీ సుప్రీం కోర్టు (Supreme Court)కు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంగళవారం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Chandrababu: CID to Supreme Court on Chandrababu's bail in 'Skill' case..!

కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం హైకోర్టు భారీ ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. ఈనెల 29 నుంచి ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాలుపంచుకోవచ్చని స్పష్టం చేసింది. దుర్వినియోగమైన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వచ్చాయనే నిర్ణయానికి వచ్చేందుకు ఆధారాలేమిటో సీఐడీ చూపించకపోవడం దర్యాప్తు లోపంగా భావిస్తున్నామని పేర్కొంది.

ప్రాజెక్టులో దుర్వినియోగమైనట్లు చెబుతున్న సొమ్మును టీడీపీ బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని కోర్టు తేల్చిచెప్పింది. అందుకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలనూ ప్రాసిక్యూషన్‌ కోర్టుకు సమర్పించలేకపోయిందని పేర్కొంది. చంద్రబాబుకు రిమాండ్‌ విధించాలని కోరడానికి ముందే బలమైన ఆధారాలను సీఐడీ చూపించి ఉండాల్సిందని అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో గత నెల 31న చంద్రబాబుకు మంజూరు చేసిన మధ్యంత బెయిల్‌ ఉత్తర్వులను పూర్తి స్థాయి బెయిల్‌ ఉత్తర్వులుగా ఖరారు చేసింది. ఆయన వైద్యం చేయించుకున్న ఆసుపత్రి, పొందిన చికిత్స వివరాలను, మెడికల్‌ రికార్డులను ఈ నెల 28లోపు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు సోమవారం తీర్పు వెలువరించారు.

You may also like

Leave a Comment