ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్న టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu).. వైసీపీ (YCP) టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.. ఒక అరాచక శక్తి, ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాడని ధ్వజమెత్తారు.. నేడు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రచారంలో పాల్గొన్న ఆయన.. శృంగవరపుకోట యుద్ధానికి సై అంటుంది.. కాలు దువ్వుతుంది. దీనికి కారణం.. బాధ, ఆవేదన అని పేర్కొన్నారు..
రాష్ట్రం అంతా వైసీపీ ఓడిపోవాలని ఒకటే నినాదం అని తెలిపిన బాబు.. జీవితంలో ఎన్నో తుఫాన్లు చూశా.. మే 13న ఒకటే తుఫాన్ వస్తుందన్నారు. ఆ దాటికి వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవాలని తెలిపారు.. అసలు ఈ ప్రభుత్వంలో ఎవరికైనా రక్షణ ఉందా అని ప్రశ్నించిన ఆయన.. ముఖ్యంగా మహిళలకు అస్సలు రక్షణ లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని సంఘటనలు గుర్తు చేశారు..
గుంటూరు (Guntur)కు చెందిన ఒక మహిళ వైసీపీ ప్రభుత్వం పై పోరాడిందని తెలిపిన చంద్రబాబు.. ఈరోజు ఢిల్లీకి వెళ్లి.. ఎంతో మంది ప్రముఖులను కలవడానికి ప్రయత్నించింది.. కానీ అనుమతి లేకపోవడంతో ఆమె బొటన వేలు కట్ చేసుకుందన్నారు.. ఈ అరాచక పాలన పోవాలని ఆమె ఈ సాహసం చేసినట్లు వివరించారు.. అలాగే కర్నూల్ లో అబ్దుల్ అనే వ్యక్తి వైసీపీ ప్రభుత్వం పెట్టే బాధలు తట్టుకోలేక రైలు కిందపడి మరణించారని పేర్కొన్నారు.
జగన్ ఒక అహంకారి అని మండిపడ్డ బాబు.. ఎవరైనా అన్యాయం చేయడంలో పట్టా పుచ్చుకొన్నారని విమర్శించారు.. చివరికి విశాఖలో ఒక మంచి యూనివర్సిటీ అయినా గీతంలో కూడా తన అరాచకాన్ని చూపించారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో చట్టం-న్యాయం లేదని తెలిపిన ఆయన.. గంజాయి, మాదక ద్రవ్యాలు, చీప్ లిక్కర్ వంటి దందాలతో నింపేశారని మండిపడ్డారు.. జగన్ ఒక సైకో అని విమర్శించిన చంద్రబాబు.. పాలకులు బాగుంటే ప్రజలు బాగుపడతారన్నారు.