Telugu News » ChandraBabu : సుప్రీంకోర్టులో వాయిదాపడిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ.. బాబుకు తప్పని తిప్పలు..!!

ChandraBabu : సుప్రీంకోర్టులో వాయిదాపడిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ.. బాబుకు తప్పని తిప్పలు..!!

క్వాష్ పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.

by Venu

– చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంలో విచారణ
– వాయిదాలతో కొనసాగుతున్న కేసు
– హైకోర్టులో బాబుకు షాక్‌
– ముందస్తు బెయిల్‌ పిటిషన్లు డిస్మిస్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. రేపు కూడా ఈ కేసుపై విచారణ జరుగనుంది. సోమవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు లాయర్ సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వే సుదీర్ఘ వాదనలు వినిపించారు.

IMG_IMG_Chandrababu_2_1__2_1_SLBE0D8P

విచారణ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది 17ఏ అనేది అవినీతి నిరోధానికి ఉండాలే గానీ, కాపాడేందుకు కాదు.. ఇదే కదా చట్టం అసలు ఉద్దేశం అని వ్యాఖ్యనించారు. ఈ సందర్బంగా హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. ఇది రాజకీయ కక్ష్య సాధింపు.. పబ్లిక్ సర్వెంట్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చాలి అంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాలి అని అన్నారు. దీనిపై కేంద్రం ఎస్ఓపీ కూడా జారీ చేసిందని తెలిపారు.

ఇక, రేపు ఉదయం 10.30 గంటలకు ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించనున్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేసింది న్యాయస్థానం. అంగళ్లు కేసుతో పాటు ఇన్నర్‌ రింగ్ రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లోనూ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. అయితే, ఈ మూడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేసింది హైకోర్టు.

You may also like

Leave a Comment