Telugu News » Chandrayaan-3: ఇస్రో మరో ఘనత.. చంద్రుడి నుంచి భూకక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యుల్..!

Chandrayaan-3: ఇస్రో మరో ఘనత.. చంద్రుడి నుంచి భూకక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యుల్..!

జాబిల్లి వద్దకు పంపిన ప్రొపల్షన్ మాడ్యూల్‌(Propulsion Module)ను విజయవంతంగా చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేక ప్రయోగమని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

by Mano
Chandrayaan-3: Another achievement of ISRO.. Chandrayaan-3 module from the moon into Earth orbit..!

భవిష్యత్ ఆపరేషన్లను దృష్టిలో పెట్టుకొని ఇస్రో(ISRO) మరో ప్రయోగాన్ని పూర్తి చేసింది. చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌లో భాగంగా జాబిల్లి వద్దకు పంపిన ప్రొపల్షన్ మాడ్యూల్‌(Propulsion Module)ను విజయవంతంగా చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేక ప్రయోగమని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

Chandrayaan-3: Another achievement of ISRO.. Chandrayaan-3 module from the moon into Earth orbit..!

చంద్రయాన్-3 మిషన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ ఈ ఏడాది ఆగస్టు 23న సాఫ్ట్ ల్యాండింగ్‌ చేసింది. ‘విక్రమ్ ల్యాండర్’, ‘ప్రజ్ఞాన్ రోవర్’ల సాయంతో దీనిని పూర్తి చేశారు. దీంతో చందమామ సౌత్ పోల్‌పై కాలు మోపిన మొదటి దేశంగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే.

అయితే, చంద్రుడిపై నుంచి నమూనాలు సేకరించే ప్రణాళికలు చేస్తున్న ఇస్రో తాజాగా చేపట్టిన ప్రయోగం ఆ మిషన్‌కు దోహదపడుతుందని పేర్కొంది. నమూనాలను తీసుకొని తిరిగి వచ్చే మిషన్ కోసం వ్యూహాలు రూపొందించేందుకు ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని అదనపు సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది.

జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయిన చంద్రయాన్-3 ప్రయోగంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసింది. 2019 సెప్టెంబరులో ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషలంలో విఫలం కావడంతో ఈ సారి ఎలాంటి లోపాలకు తావులేకుండా పకడ్బందీగా ప్రయోగం చేపట్టింది. అనుకున్నట్లే 14రోజులు జాబిల్లిపై మట్టి నమూనాలతో కీలక సమాచారాన్ని ఇస్రోకు అందించింది.

You may also like

Leave a Comment