డబ్బుల కోసం పెళ్లి పేరుతో మోసం చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్న ఓ మహిళపై హైదరాబాద్ పోలీసులు(HYD Police) కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్, వెంకటగిరిలో నివాసముంటున్న నాగార్జున బాబు(Nagarjuna Babu) సినీ పరిశ్రమలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడు ‘బైరవపురం’ సినిమా షూటింగ్ సమయంలో చిత్రనిర్మాతగా వ్యవహరించిన గుడివాడ ఆశా మల్లిక(Producer Gudiwada Asha mallika) తో పరిచయం ఏర్పడింది.
తనకు ఇప్పటికే పెళ్లి అయ్యిందని, తన భర్తతో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఆమె నమ్మించింది. అయితే, సినిమా షూటింగ్ పూర్తయ్యాక మల్లికను తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించాడు నాగార్జునబాబు. డిన్నర్ తర్వాత వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత మల్లిక తాను గర్భం దాల్చానని మళ్లి చేసువాలని కోరింది. దీంతో నాగార్జునబాబు ఆమెను చిలుకూరి బాలాజీ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.
కొన్నాళ్ల తర్వాత మల్లిక తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని ఆమె కోరడంతో రూ.18.5లక్షల నగదును ఇచ్చాడు. మరో రూ.10 లక్షలను మల్లిక అకౌంట్‌కు పంపించాడు. ఇక, డబ్బులు తీసుకున్న తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఈ క్రమంలో మల్లిక గురించి ఆరా తీయగా గతంలోనే ఆమెకు రెండు పెళ్లిళ్లు కాగా, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తేలింది.
నాగార్జున బాబు ఆమెను నిలదీయడంతో కూకట్పల్లి పీఎస్‌లో గృహహింస కేసు నమోదు చేయించింది. కేసును వెనక్కి తీసుకోవాలంటే ఆస్తిలో సగం వాటాను డిమాండ్ చేసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన నాగార్జున బాబు బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు.
ఆశా మల్లికకు సంబంధించిన మోసాల చిట్టాను పోలీసుల ముందుంచాడు. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆశామల్లిక గతంలోనూ పలువురు వ్యక్తులను ఇదే విధంగా ముగ్గులోకి దింపి మోసం చేయడంతో పాటు వారిపై కేసులు పెట్టినట్లు సమాచారం.