కూనో నేషనల్ పార్కులో నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాల అనే ఛీతా.. 3 పిల్లలకు జన్మనిచ్చింది. ఛీతా కూనలు పార్కు ఆవరణలో సందడి చేస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా షేర్ చేశారు.
తల్లి పొత్తిళ్లలో కూనలు ఆడుకుంటూ కనిపించాయి. 2023 మార్చిలో జ్వాల 4 పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో బతికింది. ఈ నెల 3న నమీబియా నుంచే తీసుకొచ్చిన ఆశా అనే ఛీతా 3 కూనలకు జన్మనిచ్చింది. కాగా, కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్ లో మొత్తం ఛీతాల సంఖ్య 20కి చేరింది.
కాగా, కునో నేషనల్ పార్క్లో ఛీతాలు ఒకటి తర్వాత మరొకటి మృత్యు వాతపడుతున్నాయి. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు దఫాలుగా భారత్ కు వీటిని తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వదిలారు.
ఆ తర్వాత కొద్ది రోజులకే వివిధ కారణాలతో ఒక్కొక్కటిగా మరణించటం ప్రారంభమైంది. ఈ నెల 16న శౌర్య అనే ఛీతా మరణించింది. ఇప్పటిదాకా 2022 నుంచి 10 ఛీతాలు మృతి చెందాయి. వీటిలో 7 పెద్దవి కాగా 3 కూనలు ఉన్నాయి.
A Namibian Cheetah named Jwala has given birth to three cubs. This comes just weeks after Namibian Cheetah Aasha gave birth to her cubs.
Union Environment Minister Bhupender Yadav shares the video on his 'X' handle. pic.twitter.com/dgOsISpTU0
— ANI (@ANI) January 23, 2024