ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలున్న బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. అయితే సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించిన అధికారులకు నక్సల్స్ కు మధ్య ఈ రోజు భీకర పోరు జరిగింది.. ఈ ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి.
మరోవైపు 29 మంది మావోయిస్టులు మృతి చెందడంతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. కాంకేర్‌లోని చోటేబైథియా పీఎస్ పరిధి కల్పర్ అడవిలో ఈ సంఘటన చోటు చేసుకొంది. కాగా ఘటనాస్థలంలో ఏకే 47, మూడు ఇన్సాస్ రైఫిల్స్ సహా మొత్తం పదికిపైగా అధునాతన తుపాకులను భద్రత దళాలు స్వాధీనం చేసుకొన్నాయి..
ఇదిలా ఉండగా సరిహద్దు భద్రతా దళం (BSF), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) బృందాలు మంగళవారం సంయుక్త సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎన్కౌంటర్ (Encounter) జరిగిందని జిల్లా ఎస్పీ ఇంద్రకల్యాణ్ పేర్కొన్నారు.. ఇంతటితో ఇది ముగింపు కాదని తెలిపిన ఆయన.. ఈ అడవిలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు..
మరోవైపు మరణించిన మావోయిస్టుల్లో అగ్రనేత శంకర్రావు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన తలపై రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి.. అయితే ఈ భారీ ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా ఎన్‌కౌంటర్‌పై బీఎస్ఎఫ్ కీలక ప్రకటన చేసింది..
కాంకేర్ జిల్లాలోని కల్పర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన 29 మంది సీపీఐ మావోయిస్టు కార్యకర్తల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి 7 ఏకే సిరీస్ రైఫిళ్లు, 3 నాస్ లైట్ మెషిన్ గన్లను స్వాధీన పరచుకొన్నట్లు తెలిపింది.