389
మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున వేగంగా దూసుకెళుతున్న ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
మృతులంతా తెలంగాణ వాసులేనని, పర్యాటన కోసం వచ్చి ప్రమాదం పాలయ్యారని అధికారులు తెలిపారు. వారంతా ఆదిలాబాద్, నల్గొండ జిల్లాకు చెందిన వారని సమాచారం. అమరావతి జిల్లా చికల్దారా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
కారులో ఉన్న నలుగురు చనిపోగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.