అనారోగ్య సమస్యల (Health Isuues) తో ఇబ్బందులు పడుతున్న ఓ తల్లి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కెందుకు తన కూతుళ్లను అమ్మకానికి పెట్టింది. ఈ సంఘటన తెలంగాణా (Telangana) లో కామారెడ్డి జిల్లా (Kamareddy Dist)లో చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డి పేటలో నివాసముంటున్న ఓ మహిళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో ఒక కూతురు వయసు 7 ఏళ్లు కాగా, మరో కూతురు పుట్టి మూడు రోజులే అయ్యింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ మహిళకు రెండో కూతురు పుట్టడం సాకడం కష్టమైంది. దీంతో వీరిద్దరిని అమ్మకానికి పెట్టింది.
మూడు రోజుల వయసున్న బిడ్డను రూ. 20 వేలకు, ఏడు ఏళ్ల వయసున్న బిడ్డను రూ.30 వేలకు అమ్మకానికి పెట్టింది. అయితే ఈ సమాచారం ఐసీడీఎస్ అధికారులకు అందింది. దీంతో బిడ్డలను అమ్ముతున్న సమయంలో ఐసీడీఎస్ అధికారులు పోలీసుల సహాయంతో ఆ మహిళను పట్టుకున్నారు. అయితే ఆమె తన బిడ్డలను ఎవరికి అమ్మకానికి పెట్టింది, వారు ఎవరు అనే విషయాలను అధికారులు వెల్లడించలేదు.
కామారెడ్డి జిల్లాలో కొంత కాలంగా పిల్లల విక్రయాలు సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కామారెడ్డ జిల్లాలోనే ఓ సవతి తల్లి ఇద్దరు బాలికలను రాజస్థాన్ కు చెందిన వ్యక్తికి అమ్మడమే కాకుండా, అతనితో పెళ్లి కూడా జరిపించింది. అప్పుడు విషయం తెలుసున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బాలల సంరక్షణ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు.