Telugu News » Karnataka MInister: నష్టపరిహారం కోసమే రైతుల ఆత్మహత్యలు!

Karnataka MInister: నష్టపరిహారం కోసమే రైతుల ఆత్మహత్యలు!

మీ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇస్తే ఆత్మహత్య చేసుకుంటావా?’’ అంటూ ఆయనను ప్రశ్నిస్తున్నారు

by Sai
karnataka minister more farmers suicides after hike in compensation for family

రైతుల ఆత్మహత్యలను అవహేళన చేస్తూ కర్ణాటక మంత్రి(karnataka minister) శివానంద్ పాటిల్ (Sivanand Patil) దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు. పరిహారం కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ఆయన వివాదాస్పదంగా స్పందించారు. శివానంద్ పాటిల్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రభుత్వం చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచినప్పటి నుంచి రైతుల ఆత్మహత్యల సంఖ్య కూడా పెరిగిందని అన్నారు.

karnataka minister more farmers suicides after hike in compensation for family

కాగా, ఆయన ప్రకటనపై రైతు సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.శివానంద్‌ పాటిల్‌ ప్రకటనపై రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన రాజీనామాకు డిమాండ్‌ చేశాయి. ఇలాంటి ప్రకటన చేసిన మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం అధికారి మల్లికార్జున్ బళ్లారి అన్నారు.

‘‘మీ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇస్తే ఆత్మహత్య చేసుకుంటావా?’’ అంటూ ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ మంత్రిని మంత్రివర్గం నుంచి తప్పించాలని రైతు సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశాయి.తనపై వస్తున్న వ్యతిరేకతతో మంత్రి తన తప్పును దిద్దుకునే ప్రయత్నం చేశారు.

రైతుల మనోభావాలను దెబ్బతీయాలని తాను కోరుకోలేదని, అయితే రైతుల ఆత్మహత్యలపై నివేదించే ముందు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కోసం వేచి ఉండాలని, మరింత బాధ్యతగా వ్యవహరించాలని మీడియా ప్రజలకు తాను సలహా ఇస్తున్నట్లు వెల్లడించారు. శివానంద్ పాటిల్ ఇంతకుముందు కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి ఆయనకు రాజకీయంలో భాగమనే విమర్శలు ఉన్నాయి.

You may also like

Leave a Comment