అయోధ్య (Ayodhya)లో జనవరి 22న ‘రామ్ లల్లా’ (Ram Lalla) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ట సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకున్నారు. రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు.
ఇది ఇలా వుంటే రామ మందిర ప్రారంభోత్సవం సందర్బంగా వాస్తవాధీన రేఖ (LAC) వద్ద జై శ్రీ రామ్ నినాదాలు మార్మోగాయి. ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో భారత-చైనా సైనికులు ఒకే చోటకి చేరుకున్నారు. ఇరు దేశాల సైనికులు అభివాదం చేసుకున్నారు. అనంతరం చైనా సైనికులు జై శ్రీ రామ్ నినాదాలు చేశారు.
దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను అటు భారత ఆర్మీ కానీ, ఇటు చైనా ఆర్మీ కానీ ధ్రువకరించలేదు. కానీ వీడియోలో మాత్రం భారతీయ సైనికులు చైనా సైనికులు ఒకే దగ్గర ఉండటం, భారత సైనికులు చెప్పగానే చైనా సైనికులు జై శ్రీ రామ్ అని అనడం వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియో మూడు నెలల క్రితం విడుదలైనట్టుగా తెలుస్తోంది. బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజున ఈ వీడియోను ఓ మాజీ సైనికుడు ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ఇక భారత్-చైనా సరిహద్దుల్లో గత కొన్నేండ్లుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి.