పంజాబ్ సీఎం(Panjab CM) భగవంత్ సింగ్ మాన్ (Bhagwat singh mann) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మొదటి భార్య కూతురు భగవంత్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఇప్పడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సీఎంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
సీఎం భగవంత్ మాన్ కూతురు సీరత్ కౌర్ ఆ వీడియోలో మాట్లాడుతూ.. మూడోసారి తండ్రి కాబోతున్నారంటూ ఆ వీడియోలో తెలిపింది. ఈ విషయం తమకు సన్నహితుల ద్వారా తెలిసిందని చెప్పింది. కుటుంబ బాధ్యతలే సరిగా నిర్వర్తించలేని వ్యక్తి.. ఈ రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించింది. నమ్మిన వారిని మోసం చేయొద్దంటూ తన తండ్రిని కోరింది.
అంతేకాకుండా మొదటి నుంచి తన తండ్రి అబద్దాలు చెబుతూనే కాలం వెళ్లదీస్తున్నారని తెలిపింది. పంజాబ్ ప్రజలతోనూ అదే చేస్తున్నారంటూ ఆరోపించింది. తన కుటుంబానికి చేసిన అన్యాయమే పంజాబ్ ప్రజలకు చేస్తున్నారంటూ వాపోయింది. తన తల్లితో విడాకులకు సంబంధించి అంశం పక్కన పెడితే.. ఆమెను మానసికంగా బలహీన పరిచినట్లే అవుతుందని తెలిపింది.
తన తండ్రి ఇప్పటికీ విధాన సభకు, గురుద్వార్ సాహెబ్‌కు మద్యం మత్తులోనే వెళ్తున్నారని సీఎం భగవంత్ మాన్ కూతురు ఆరోపించింది. అదేవిధంగా సీరత్‌కౌర్ మాట్లాడిన వీడియోను ఆమె తల్లి, భగవంత్ మాన్ మొదటి భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ దేవుడే ప్రజలను రక్షించాలంటూ తన భర్తపై పరోక్ష విమర్శలు చేసింది.
‘నేను ఈ వీడియోను తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్ చేయాల్సి వచ్చింది. మేము రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాం. కానీ కొన్ని సార్లు నిశ్శబ్దం కూడా నేరమే. నిజమైన దోషులు ప్రజలకు తెలియాలి. విడాకులు తీసుకున్నాక తండ్రికి పిల్లలపై ఎలాంటి బాధ్యతలు ఉండవని ఏ చట్టంలో ఉంది. ఒకవేళ పంజాబ్ ప్రజల కోసం మమ్మల్ని పట్టించుకోకుంటే ఇంకొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంటారు’ అంటూ భగవంత్ మాన్ భార్య రాసుకొచ్చింది.
Very Serious allegations again AAP Punjab CM @BhagwantMann by his daughter.
A must watch.
I did English subtitles for people who aren't fluent in Punjabi. https://t.co/j88lw2iL6x pic.twitter.com/WLWI67nvNq
— Arun Pudur (@arunpudur) December 9, 2023