సీఎం జగన్మోహన్ రెడ్డి(CM Jaganmohan Reddy) రూ.216 కోట్లతో ఇంద్రకీలాద్రి(Indra keeladri)పై కనక దుర్గగుడి(Kanakadurga) అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గురువారం ఉదయం శంకుస్థాపనలు చేశారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సీఎం జగన్‌కు అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంత్రి కొట్టు సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, చైర్మన్ కర్నాట రాంబాబు సీఎంకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణానికి రూ. 5.60 కోట్లు, ఇంద్రకీలాద్రిపై కొండ రక్షణ చర్యలపనుల నిమిత్తం రూ. 4.25 కోట్లు, ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ వాటర్ మేనేజ్‌మెంట్, స్కాడా ఏర్పాటు నిమిత్తం రూ.3.25 కోట్లు కేటాయించారు. అదేవిధంగా నూతన కేశఖండనశాల నిర్మాణానికి రూ.19 కోట్లు, గోశాల అభివృద్ధి నిమిత్తం రూ.10కోట్లు, కొండపన యాగశాల కోసం రూ.5 కోట్లు, కనకదుర్గనగర్‌లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిమిత్తం రూ.33 కోట్లు కేటాయించారు.
అమ్మవారి ప్రసాదం పోటు భవన నిర్మాణానికి రూ.27కోట్లు, కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.13 కోట్లు కేటాయించారు. రాజగోపురం ముందు భాగాన మెట్ల నిర్మాణానికి రూ.15 కోట్లు, మహామండపం వద్ద అదనపు క్యూలైన్లకు రూ.23.50 కోట్లు, కనక దుర్గ నగర్ వద్ద మహారాజద్వారం నిర్మాణానికి రూ.7.75కోట్లు, కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు రాజమార్గం అభివృద్ధికి రూ.7.50కోట్లు కేటాయించారు.
అదేవిధంగా కొండపైన పూజా మండపాల నిర్మాణానికి రూ.7కోట్లు, మల్లికార్జున మహామండపం క్యూ కాంప్లెక్స్ మార్పునకు రూ.18.30 కోట్లు కేటాయించారు. 2016 పుష్కరాల సమయంలో కూల్చివేసిన ఆలయాల పునర్నిర్మాణంకు రూ 3.87 కోట్లు, మెగా సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రూ. 5.66 కోట్లు వెచ్చిస్తున్నారు. అదేవిధంగా కొండ దిగువున బొడ్డు నిర్మాణం, కొండ దిగువున తొలిమెట్టు వద్ద ఆంజనేయ స్వామి, వినాయక స్వామి వార్ల ఆలయ నిర్మాణం, అమ్మవారి అన్న ప్రసాద భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.