పిల్లల మేనమామ బాధ్యతను తాను నెరవేరుస్తున్నానని సీఎం జగన్(CM Jagan) అన్నారు. అల్లూరి జిల్లా(Alluri District) చింతపల్లిలో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటించారు. జగన్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. 55 నెలలుగా ప్రభుత్వం ప్రతీ అడుగు విప్లవాత్మక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
ట్యాబ్‌లు రిపేర్‌కు వచ్చిన కంగారు పడొద్దని వారం రోజుల్లో తిరిగి అందజేసే వ్యవస్థ అందుబాటులో ఉందని జగన్ తెలిపారు. ట్యాబుల కంటెంట్ సేఫ్టీ, సెక్యూరిటీ మీద తల్లిదండ్రులు ఆందోళన చెండాలిసిన అవసరం లేదు. నాడు- నేడు కింద డిజిటలైజేషన్ 62 వేల 97 క్లాస్ రూములు జనవరి 30కి పూర్తవుతుందని సీఎం జగన్ తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక మార్పులు తీసుకుని వస్తోందని, ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న చాలా ఉద్యోగాలు కానుమరుగుకానున్నాయని సీఎం తెలిపారు.
ఐబీ సిలబస్ ప్రవేశ పెడుతున్నామని ఐబీ సర్టిఫికేషన్ తీసుకుని వెల్లడించారు. ఖర్చు పెట్టె ప్రతీ రూపాయి హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్, ఖర్చు పెడుతుంటే దుబారా చేస్తున్నారని గిట్టని వాళ్ళు మాట్లాడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. పేద పిల్లల విద్య మీద ఇంతగా ఖర్చు పెట్టిన రాష్ట్రం మరొకటి లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. పేద పిల్లలకు మేలు జరుగుతుంటే విషం చిమ్ముతున్నారని విమర్శించారు. మీ పిల్లలు, మనవళ్ళు ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు వాడుతున్నప్పుడు పేద పిల్లల దగ్గర ఎందుకు ఉండకూడదు అని జగన్ ప్రశ్నించారు.
పేద పిల్లలు ఇంగ్లీష్ చదువులు చదివితే తెలుగు అంతరించిపోతుందనే ప్రచారం ఎంత వరకు న్యాయమన్నారు. చంద్రబాబు ఆరు గ్యారెంటీలు ఇతర సంక్షేమ పథకాలు కలుపుకుంటే జగన్ ఇచ్చే దానికంటే వాళ్ళు చెప్పేది మూడు రెట్లు ఎక్కువ.. రాష్ట్రం అప్పుల్లో కురుకుపోతుందని రాతలు రాస్తున్న వాళ్లకు ఇవి కనిపించడం లేదా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. 2014-19ల మధ్య అన్ని వర్గాలను అడ్డగోలుగా మోసం చేశారని జగన్ చెప్పుకొచ్చారు.