Telugu News » CM Jagan: ఒక్కొక్కరికి రూ.2,500.. డబ్బులు రాకుంటే ఫోన్ చేయండి: సీఎం జగన్

CM Jagan: ఒక్కొక్కరికి రూ.2,500.. డబ్బులు రాకుంటే ఫోన్ చేయండి: సీఎం జగన్

ఏపీ(AP)లో తుపాను ప్రభావిత ప్రాంతాలను సీఎం జగన్(CM Jagan)పర్యటించారు. తిరుపతి జిల్లాలో పర్యటించి నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

by Mano
CM Jagan: Rs 2,500 per person.. Call if money is not received: CM Jagan

ఏపీ(AP)లో తుపాను ప్రభావిత ప్రాంతాలను సీఎం జగన్(CM Jagan)పర్యటించారు. తిరుపతి జిల్లాలో పర్యటించి నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. రైతులకు అపార నష్టం కలిగిందని, ఇంటింటికీ రూ.2,500 అందిస్తున్నామన్నారు. ఎవరికైనా అందకపోయినా, సమస్యలు ఉన్నా 1902 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.

CM Jagan: Rs 2,500 per person.. Call if money is not received: CM Jagan

తిరుపతి జిల్లాలో పర్యటన అనంతరం సీఎం జగన్ నేరుగా బాపట్ల జిల్లాకు వెళ్లారు. అక్కడ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ స్థానికులు, రైతుల్ని పరామర్శిస్తారు. అదేవిధంగా పొలాలను పరిశీలిస్తారు.. పంట నష్టంపై ఆరా తీయనున్నారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్‌ బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేశామని.. ప్రతీ ఇంటికి రూ. 2,500 ఇచ్చామన్నారు. స్వర్ణముఖి కాలువకు పడిన గండిని పరిశీలించానని.. స్వర్ణముఖిపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు జగన్. భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా హై లెవెల్ బ్రిడ్జిని రూ.30కోట్లతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అక్కడ నా కార్యాలయ సిబ్బంది సమస్యను పరిష్కరిస్తారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

అదేవిధంగా నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామన్నారు సీఎం జగన్. వారం లోగా సాయం అందుతుందన్నారు రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ నాలుగైదు రోజుల్లో భారీ వర్షం కురిసిందని..ఈ కష్టం.. ఈ నష్టం వర్ణణాతీతమని జగన్ అన్నారు. సాయం కోసం 92 రిలీఫ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

You may also like

Leave a Comment