Telugu News » CM KCR : కాంగ్రెస్ చరిత్ర అంతా మోసలమయమే….!

CM KCR : కాంగ్రెస్ చరిత్ర అంతా మోసలమయమే….!

50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు ఎలా బతికారో అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్‌లో డజన్ మంది సీఎం క్యాండిడెట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు.

by Ramu

కాంగ్రెస్ (Congress) చరిత్ర అంతా మోసాల మయమని సీఎం కేసీఆర్ (CM KCR) మండిపడ్డారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు ఎలా బతికారో అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్‌లో డజన్ మంది సీఎం క్యాండిడెట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. వాళ్లు గెలిచేదే లేదన్నారు. ఒకప్పుడు తెలంగాణను ఊడ గొట్టిందే కాంగ్రెస్ అంటూ ధ్వజమెత్తారు. బలవంతంగా తెలంగాణను తీసుకు వెళ్లి ఆంధ్రలో కలిపి ఇబ్బందులకు గురి చేశారని ఫైర్ అయ్యారు.

మధిరలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమేనని చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో చిత్తశుద్ధితో పనిచేశామని వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపామన్నారు. తెలంగాణ ప్రతి అంగుళం తనదేనన్నారు. ఏ ప్రాంతం బాగుపడినా తనకు గర్వకారణమేనని స్పష్టం చేశారు.

ఎన్నికలప్పుడు హడావుడి కాకుండా.. ఓటు వేసే ముందు అభ్యర్థుల పనితనం, పార్టీల చరిత్రను పరిశీలించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఏకైక ఆయుధం ఓటు అని చెప్పారు. మీ ఓటు మీ భవిష్యత్‌తో పాటు రాష్ట్ర భవిష్యత్‌ను కూడా నిర్ణయిస్తుందన్నారు. మళ్లీ కాంగ్రెస్ కు 20 సీట్లు మాత్రమే వస్తాయన్నారు. పూర్తి మెజార్టీతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మధిరలో కమల్ రాజ్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. కమల్ రాజ్‌ను గెలిపిస్తే మధిరలో ప్రతి ఒక్క కుటుంబానికి దళితబంధు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతుబంధు వేస్ట్‌ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, దాన్ని తీసి బంగాళాఖాతంలో పడేస్తామని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. మరి రైతుబంధు వేస్టేనా..? అని ప్రశ్నించారు. రైతుబంధు కావాలె గదా..?, రైతుబంధు ఉండాలంటే ఇక్కడ కమల్‌రాజ్‌ను గెలిపించాలన్నారు.

బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే రైతుబంధు ఉండడమే కాదు, రైతుబంధును ఎకరానికి రూ.16 వేలకు పెంచుతామన్నారు. 24 గంటల కరెంట్ అవసరమే లేదని చెప్తున్నరని అన్నారు. ధరణి స్థానంలో భూమాత తీసుకు వస్తామంటున్నారని, ఇవన్నీ తలకాయ లేని మాటలు అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ నేతలను నమ్మి ఓటేస్తే మోసపోతరని హెచ్చరించారు.

కర్ణాటక డిప్యూటీ సీఎం వచ్చి తాము మహారాష్ట్రలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పిండన్నారు. మా రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావని అడిగామన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేశామన్నారు. 80 లక్షల మందికి అద్దాలు ఇచ్చామన్నారు. ఈ 80 లక్షల అద్దాలు తమవే ఉండంగ కాంగ్రెస్‌ ఎట్ల గెలుస్తదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే పెన్షన్ ను రూ.200 నుంచి రూ.1000 పెంచామన్నారు. ఆ తర్వాత రూ.2 వేలకు పెంచామన్నారు.. భవిష్యత్తులో దాన్ని రూ.5 వేలకు పెంచబోతున్నామన్నారు.

You may also like

Leave a Comment