Telugu News » CM KCR : సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా.. గవర్నర్ ఆమోదం..!

CM KCR : సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా.. గవర్నర్ ఆమోదం..!

రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా ప్రకటించారు.

by Ramu
cm kcr submitted resignation letter to governor

– సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా
– ఓఎస్డీ ద్వారా గవర్నర్ కు అందజేత
– ఆ వెంటనే ఫాంహౌస్ కు పయనం
– రాజీనామాను ఆమోదించిన గవర్నర్

సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసై కి పంపి అక్కడి నుంచి ఫాంహౌస్ కు వెళ్లారు.

cm kcr submitted resignation letter to governor కేసీఆర్ ఎప్పుడూ ఆర్భాటంగా కాన్వాయ్ తో బయలుదేరేటప్పుడు ముందుగా అక్కడున్న పోలీసులకు సమాచారమిచ్చి వెళ్తారు. అవసరమైతే తాను ఎందుకు వెళ్తున్నానో మీడియాకు కూడా లీకులు ఇచ్చేవారు.

అయితే.. ఇప్పుడు కనీసం మొహం చూపించకుండా ఎలాంటి ఆర్భాటం లేకుండా.. కనీసం అక్కడున్న పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా సొంత వాహనంలో వెళ్లి ఓఎస్డీకి సమర్పించారు. ఆ తరువాత కూడా ఎవరికీ తెలియకుండా తన ఫాంహౌస్ కు వెళ్లారు. కేసీఆర్ కామారెడ్డిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు.

మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో విజయం మూడు పార్టీలతో దోబూచులాడింది. మొదటి బీజేపీ అభ్యర్థి వెంటక రమణ లీడింగ్ లోకి వచ్చారు. ఆ కొద్ది సేపటికే సీఎం కేసీఆర్ పుంజుకున్నారు. ఇంతలో అనూహ్యంగా రేవంత్ రెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. ఇలా పలు రౌండ్లలో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. చివరికి బీజేపీ అభ్యర్థి చేతిలో కేసీఆర్, రేవంత్ ఓడిపోయారు.

You may also like

Leave a Comment