Telugu News » CM Revanth Reddy : కేసీఆర్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారు….!

CM Revanth Reddy : కేసీఆర్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారు….!

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు చూశారని వెల్లడించారు.

by Ramu
Revanth-reddy-on-kcr

కేసీఆర్ (KCR) ఒక కాలం చెల్లిన ఔషధమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత ఏంటో అర్థం అవుతోందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు చూశారని వెల్లడించారు.

cm revanth Fire on kcr

ఇవి కూడా చదవండి : అయోధ్యలో కొత్త ప్రాజెక్ట్.. ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయాలు..!

కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని విమర్శించారు. కేసీఆర్‌ చిత్తశుద్ధిని గుర్తించి కృష్ణా పరివాహక ప్రజలు తీర్పునిచ్చారని చెప్పారు. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టతతో ఉన్నామన్నారు. తెలంగాణ ప్రతిపక్ష నేతకు గది కేటాయింపు విషయంపై స్పందిస్తూ…. గది మార్పు విషయం స్పీకర్ నిర్ణయమని తెలిపారు.

కాళేశ్వరంపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పిందన్నారు. ఆ విషయంలో విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించుకోవాలని చెప్పారని వివరించారు. హైకోర్టు సూచనలపై మంత్రివర్గంలో లేదా అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. మరోవైపు మిషన్ భగీరథపై విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. విధానపర లోపాలు లేకుండా పాలన సాగిస్తున్నామని వివరించారు.

ఇవి కూడా చదవండి : గవర్నర్‌తో ముప్ఫై మోసాలు అరవై అబద్ధాలు చెప్పించారు.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి..! 

బీఏసీ సమావేశానికి అందులోని సభ్యులే రావాలన్నారు. అంతే కాని రేపు హిమాన్షు (కేటీఆర్ కుమారుడు) కూడా వస్తానంటే ఎలా అని ఎద్దేవా చేశారు. ఐదేండ్ల పాటు శాసనసభ వ్యవహారాల మంత్రిగా హరీశ్ రావు పని చేశారని, ఆయనకు ఆ మాత్రం అవగాహన లేదా? అని నిలదీశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసేది అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామని తేల్చి చెప్పారు. త్వరలోనే మరో రెండు గ్యారంటీలు అమల్లోకి వస్తాయన్నారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ గ్యారంటీల అమలుపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

అసెంబ్లీలో కులగణన తీర్మానం ఉంటుందన్నారు. ప్రాజెక్టులను గత ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించిందని ఆరోపణలు గుప్పించారు. సాగర్‌ను పోలీసులతో జగన్ ఆక్రమించినా కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏపీ వాళాలు ప్రతి రోజు 12.5 టీఎంసీలను తీసుకెళ్తుంటే కేసీఆర్ అడ్డుకోలేదని ఫైర్ అయ్యారు.

 

You may also like

Leave a Comment