Telugu News » Revanth Reddy : సేవ చేస్తేనే ప్రజల్లో ఉండిపోతారు..!

Revanth Reddy : సేవ చేస్తేనే ప్రజల్లో ఉండిపోతారు..!

తెలంగాణ ఉద్యమంలో కాకా ఫ్యామిలీ ముందుందని గుర్తు చేశారు రేవంత్. ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీస్ కూడా కాకా పేరునే ఉందని తెలిపారు. దేశ నిర్మాణంలో కూడా ఆయన పాత్ర ఉందన్నారు.

by admin
cm-revanth-reddy-about-kaka-venkataswamy

తెలంగాణ (Telangana) ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy). హైదరాబాద్‌ లోని బీఆర్‌ అంబేద్కర్‌ కళాశాలలో స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా పని చేస్తే కచ్చితంగా గమ్యాన్ని చేరుకోవచ్చు అని విద్యార్థులకు సూచించారు.

cm-revanth-reddy-about-kaka-venkataswamy

డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలని చెప్పారు రేవంత్. ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తే తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. దేశంలో గాంధీ కుటుంబంలా, రాష్ట్రంలో కాకా కుటుంబం.. పార్టీకి అండగా ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

అంతకుముందు, కాలేజీలో కాకా విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం. పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ కరస్పాండెంట్ సరోజా వివేక్, వంశీకృష్ణ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాకా ఫ్యామిలీ ముందుందని గుర్తు చేశారు రేవంత్. ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీస్ కూడా కాకా పేరునే ఉందని తెలిపారు. దేశ నిర్మాణంలో కూడా ఆయన పాత్ర ఉందన్నారు.

వివేక్, వినోద్ లవకుశులని కొనియాడారు సీఎం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు, విద్యను అందిస్తున్న ఘనత కాకా కుటుంబానిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. కాకా ఒక్క డ్రీమ్ ఉన్న నాయకుడన్నారు. రాష్ట్రపతి కావాలన్న ఒక్క కోరిక ఆయనకు నెరవేరలేదని తెలిపారు. కాకా సూచనలతో పేదలకు మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు.

You may also like

Leave a Comment