Telugu News » Revanth Reddy : అత్యధిక పుస్తకాలు చదివిని మేధావి…. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్…!

Revanth Reddy : అత్యధిక పుస్తకాలు చదివిని మేధావి…. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్…!

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నిర్ధిష్ట విధానం ఉంటుందన్నారు. జిరాక్స్​ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలను భర్తీ చేసేవాళ్లం తాము కాదని బీఆర్ఎస్‌ను ఎద్దేవా చేశారు.

by Ramu
Cm revanth Reddy fire on kcr

త్వరలోనే గ్రూప్​-1 (Group-1) నోటిఫికేషన్​ ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యం అయిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నిర్ధిష్ట విధానం ఉంటుందన్నారు. జిరాక్స్​ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలను భర్తీ చేసేవాళ్లం తాము కాదని బీఆర్ఎస్‌ను ఎద్దేవా చేశారు.

Cm revanth Reddy fire on kcr

ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలను అమ్ముకునే వాళ్లం కాదని విమర్శలు గుప్పించారు. గ్రూప్​ -1 వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం 15 రోజుల్లో పోలీసు ఉద్యోగాలను ఇచ్చేందుకు రెడీగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పరిపాలనలో మైనార్టీలకు సముచిత స్థానం ఇస్తున్నామని వెల్లడించారు.

సీఎంఓలో మైనార్టీ ఐఏఎస్​లకు కీలక బాధ్యతలు అప్పగించామన్నారు. మైనార్టీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే అడ్డుకున్నారని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అంతా టీజీ అని రాసుకునేవాళ్లని గుర్తు చేశారు. కేంద్రం కూడా వారి నోటిఫికేషన్​లో టీజీ అని పేర్కొందని సీఎం తెలిపారు. కొంత మంది యువకులు వారి గుండెలపై టీజీ అని పచ్చబొట్టు వేయించుకున్నారని అన్నారు.

ఉద్యమ సమయంలో వాహనాలపై, బోర్డులపైన అందరం టీజీ అనే రాసుకున్నామని వెల్లడించారు. కానీ అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్పరించేలా టీఎస్​ అని పెట్టిందని మండిపడ్డారు. తెలంగాణకు అందెశ్రీ అనే కవి గొప్ప గీతాన్ని అందించారని పేర్కొన్నారు. జయ జయహే తెలంగాణ గీతం తెలంగాణ ఉద్యమంలో అందరికీ స్ఫూర్తినిచ్చిందనివివరించారు. రాష్ట్రం వచ్చాక జయజయహే తెలంగాణ పాట రాష్ట్ర గీతం అవుతుందని ఆశించారని చెప్పుకొచ్చారు. . కానీ తెలంగాణ వచ్చాక జయజయహే తెలంగాణ పాటను నిషేధించినంత పని చేశారని మండిపడ్డారు.

‘మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తే విమర్శలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల క్రమంగా ఆదాయం పెరుగుతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ముఖ్యంగా దేవాదాయ శాఖకు ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని రెచ్చగొడుతున్నారు. గత ప్రభుత్వం మహిళలను ఎన్నో రకాలుగా అవమానించింది. మొదటిసారి ఏర్పడిన టీఆర్​ఎస్​ ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ తమ ప్రభుత్వం తొలిసారే ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చింది’అని అన్నారు.

ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారంటూ నిప్పులు చెరిగారు. ప్రజలు ఇబ్బందులు పడితే బాగుండని విపక్షం కోరుకుంటోందని మండిపడ్డారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదన్నారు. మంచి పనులకు అభినందించే సద్బుద్ధి కూడా విపక్షాలకు లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు ఈ నెల 1న జీతాలు ఇచ్చామని హర్షం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ను ప్రధాన ప్రతిపక్ష నేత అంటూ పరోక్షంగా ప్రస్తావించారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు ఉన్న రాజకీయ అనుభవాన్ని, పాలన అనుభవాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించాల్సిందన్నారు. కానీ దానికి భిన్నంగా ఆయన సభకు రాకపోవడం బాధాకరమన్నారు. అత్యధిక పుస్తకాలు చదివిన మహా మేధావి అని చెప్పుకుంటారు కదా.. వారు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడమో లేదా తప్పిదాలు ఉంటే సరిచేయడమో చేయాలి కదా అని అన్నారు.

 

You may also like

Leave a Comment