Telugu News » Kishan Reddy : బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరడానికి సిద్దమవ్వండి.. కిషన్ రెడ్డి..!

Kishan Reddy : బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరడానికి సిద్దమవ్వండి.. కిషన్ రెడ్డి..!

బీజేపీకి వస్తున్న ఆదరణ చూసిన ప్రతిపక్షాలు నిరాశగా ఉన్నాయన్నారు. వారికి తమ భవిష్యత్తు అంధకారంలో కనబడుతుందన్నారు. గ్రామస్థాయిలో చేరికల పై దృష్టి పెట్టామని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేస్తాం.. మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

by Venu
kishan reddy letter to cm revanth reddy on bharat mala project

పార్లమెంట్ ఎన్నికలకు (Parliament Elections) సమయం సమీపిస్తుండటంతో నేతలంతా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy).. బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణలో బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదని, ఆ పార్టీ నేతలంతా తమ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం, దేశ ప్రయోజనాల దృష్ట్యా మోడీ నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు.. దేశమంతా ఒక్కటేననే నినాదంతో బీజేపీ ముందుకు సాగుతుందని తెలిపారు.

kishan reddy fires on brs and congress

మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ కార్యాలయాలకు తాళం వేశారని.. తెలంగాణ (Telangana)లోనూ అదే పరిస్థితి వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ (BJP) ఫామ్ లోకి వచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజలనుంచి సానుకూల స్పందన కనబడుతోందన్నారు. అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండాలనే దానిపై ఎన్నికల మీటింగ్ లో చర్చ జరిగిందన్నారు. కార్యకర్తల నుంచి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి వివరాలు సేకరించామన్నారు. ప్రాబబుల్స్ లిస్ట్ రెడీ అయ్యిందని, త్వరలో అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు.

బీజేపీకి వస్తున్న ఆదరణ చూసిన ప్రతిపక్షాలు నిరాశగా ఉన్నాయన్నారు. వారికి తమ భవిష్యత్తు అంధకారంలో కనబడుతుందన్నారు. గ్రామస్థాయిలో చేరికల పై దృష్టి పెట్టామని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేస్తాం.. మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఎంపి లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేకం అనే విషయాన్ని.. మోడీ పార్లమెంట్ ఉభయ సభల్లో వివరించారన్నారు.

రిజర్వేషన్లను నెహ్రూ అడ్డుకొన్న విషయాన్ని సైతం బయటపెట్టారని తెలిపారు. మోడీ కులంపై రాహుల్ తప్పుడు వాఖ్యలు, అసంబద్ధ వాఖ్యలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీతో పాటూ ఓబీసీ సమాజానికి రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ కులగణనను ఎక్కడా అడ్డుకోలేదు.. అడ్డు పడలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు.

You may also like

Leave a Comment