తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY)ఢిల్లీకి చేరుకున్నారు.ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy cm Batti Vikramarka), ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్(Irrigation minister Uttam kumar Reddy) సైతం వెళ్లారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల ఎంపిక గురించి చర్చించేందుకు బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది.
ఈ సమావేశానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించనుండగా.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహులు గాంధీలు ఈ మీటింగ్కు హాజరుకానున్నారు.అదేవిధంగా సీఈసీ మీటింగులో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొననున్నారు.
తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు గాను 8 స్థానాల్లో ఎంపీ అభ్యర్థుల ఎంపిక(Mp Final Candidates Selection)పై సీఈసీ మీటింగులో చర్చించనున్నారు. ఈ కమిటీ ముందు రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఉంచనున్నారు. ఈ మీటింగులో స్క్రీనింగ్ కమిటీ, సీఈసీ ఏకాభిప్రాయానికి వస్తే అభ్యర్థులను నేడు లేదా రేపు(గురువారం) అధికారికంగా ప్రకటించున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8 స్థానాల్లో (భువనగిరి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం) అభ్యర్థులు ఫైనల్ కాలేదు.
ఈ స్థానాల్లో ఐదింటిలో అభ్యర్థల ఎంపిక ఫైనల్ అయినట్లు తెలుస్తుండగా మరో మూడు స్థానాల్లో మాత్రం తీవ్రమైన పోటీ నెలకొంది.దీంతో దీనిపై సీఈసీ మీటింగులో చర్చల అనంతరం క్యాండిడేట్ల ఫైనల్ లిస్టుపై తుదినిర్ణయం తీసుకోనున్నారు.ఇదిలాఉండగా, సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లగా ఎంపీ టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమకే టికెట్ వస్తుందని కొందరు నేతలు ధీమాతో ఉన్నారు.