Telugu News » BRS MLC Kavita : జాతీయ నేతలు వచ్చి ఆ వాతావరణాన్ని చెడగొట్టొద్దు.. ఎమ్మెల్సీ కవిత..!!

BRS MLC Kavita : జాతీయ నేతలు వచ్చి ఆ వాతావరణాన్ని చెడగొట్టొద్దు.. ఎమ్మెల్సీ కవిత..!!

రాహుల్, ప్రియాంక గాంధీల రాక సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పలు విమర్శలు సంధించారు. తెలంగాణలో చాలా మంచి వాతావరణం ఉంది. జాతీయ నేతలు వచ్చి ఆ వాతావరణాన్ని చెడగొట్టొద్దు అంటూ సెటైర్లు వేశారు.

by Venu

తెలంగాణలో (Telangana) రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకు పోతున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలు తమ ప్రచారాల్లో స్పీడ్ పెంచాయి. ఈ క్రమంలో గ్రామ, పట్టణాలలో పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నాలలో నేతలు ఉన్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (priyanka Gandhi) ఇవాళ తెలంగాణకు రానున్నారు.

అయితే రాహుల్, ప్రియాంక గాంధీల రాక సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పలు విమర్శలు సంధించారు. తెలంగాణలో చాలా మంచి వాతావరణం ఉంది. జాతీయ నేతలు వచ్చి ఆ వాతావరణాన్ని చెడగొట్టొద్దు అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికలు వచ్చాయని తెలంగాణకు జాతీయ నేతలంతా క్యూకట్టి మరీ వస్తున్నారు. వీరంతా పదేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదు గానీ ఓట్ల కోసం వస్తున్నారు అంటూ విమర్శించారు.

తెలంగాణ గురించి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, ఏమీ లేదు కానీ ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఏం చెబుతారు..? అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ, రాహులు గాంధీలు రాష్ట్రంలో పర్యటిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూడాలి అంటూ సూచించారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ కూడా బీఆర్‌ఎస్‌ పై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఈ విమర్శలనే ప్రధాన అస్త్రాలుగా మలచుకొన్నట్టు వీరి తీరు చూస్తే తెలుస్తోంది.

You may also like

Leave a Comment