తెలంగాణ రాష్ట్రానికి మాయని మచ్చగా కాళేశ్వరం అవినీతి అంటుకొంటుందా..? కాళేశ్వరం పేరుతో.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగాధంలోకి నెట్టిన బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొనున్న చర్యలు ఏంటీ.. ? అప్పుల తెలంగాణను రేవంత్ ప్రభుత్వం.. అభివృద్ధి వైపు నడిపిస్తుందా..? రాష్ట్ర ప్రజల ఆశయాలని హస్తం నెరవేరుస్తుందా..? బీఆర్ఎస్ డెన్ గా మారిన తెలంగాణ భవిష్యత్తుని కాంగ్రెస్ మారుస్తుందా ?..
ప్రస్తుతం ఏ గల్లీ పోరన్ని కదిలించినా.. ఇవే ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు.. రాష్ట్ర ప్రజల మనసుల్లో ఈ ఆలోచనలు అంతర్గత యుద్ధం చేస్తోన్నాయి. మరోవైపు కాళేశ్వరం (Kaleshwaram) అవినీతి అంశం రాష్ట్రంలో కారు చిచ్చులా రగులుకొంటుందని తెలుస్తోంది. ఒకగానొక సమయంలో ఈ అంశంపై రేవంత్ (Revanth) సర్కార్ విఫలం అయితే.. ఎదురైయ్యే పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయనే గుసగుసలు వినిపిస్తోన్నాయి.. మొత్తానికి సమాధానం దొరకని ప్రశ్నలతో సతమతం అవుతోన్న జనానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (Jeevan Reddy) ఉపశమనం కలిగే వార్తని అందించారు.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని జీవన్‌రెడ్డి తెలిపారు.. ఈ విషయంలో పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందన్న జీవన్‌రెడ్డి.. ఇందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు పై సీబీఐ విచారణ కోరుతున్నట్టు తెలిపారు.. కాంగ్రెస్ (Congress) నేత నిరంజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు వివరించారు.. ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిందని జీవన్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దోషులను ఉరి తీయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ లీడర్లు ప్రాజెక్టుల డిజైన్ చేస్తే ఇలానే అవుతుందంటూ జీవన రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ పిల్లర్ల కుంగుబాటు వెనుక విద్రోహ శక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో.. ఇరిగేషన్ శాఖకు చెందిన AEE రవికాంత్.. అక్టోబర్ 24న మహాదేవ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పీడీపీపీ సెక్షన్ కు చెందిన మూడు సెక్షన్లతో పాటు ఐపీసీ 427 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు..