Telugu News » Revanth Reddy : రాష్ట్రంలో ప్రతి పైసా పెట్టుబడికి తగిన రక్షణ కల్పిస్తాం…!

Revanth Reddy : రాష్ట్రంలో ప్రతి పైసా పెట్టుబడికి తగిన రక్షణ కల్పిస్తాం…!

రాష్ట్రంలోని హైదరాబాద్ (Hyderabad)​ లాగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పారు. పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలనేది తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

by Ramu
revanth-governmt

రాష్ట్రంలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి తగిన రక్షణ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. పారిశ్రామికాభివృద్ధి అనేది కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని తెలిపారు. రాష్ట్రంలోని హైదరాబాద్ (Hyderabad)​ లాగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పారు. పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలనేది తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

cm revanth reddy review on industries department

సచివాలయంలో పరిశ్రమ శాఖపై సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… పెట్టుబడులు ఆహ్వానించేలా తమది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానమన్నారు. కొత్త ఫార్మా విలేజీలు నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్​ తరహా రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని రంగాల పరిశ్రమలకు తమ ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు.

2050 నాటికి రాష్టమంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలని ఆకాంక్షించారు. సుదీర్ఘ భవిష్యత్​ లక్ష్యంతో మెగా మాస్టర్​ పాలసీ రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని వెల్లడించారు. మొదటిగా ఔటర్​ రింగ్​రోడ్డు లోపల అర్బన్​ క్లస్టర్, రెండవది ఓఆర్​ఆర్​, ఆర్​ఆర్​ఆర్​ మధ్య ప్రాంతం సెమీ అర్బన్​ క్లస్టర్​గా, మూడవది రీజనల్​ రింగ్​ రోడ్డు తర్వాత ప్రాంతం రూరల్​ క్లస్టర్​గా విభజించామన్నారు.

జహీరాబాద్​లో ఐటీ, ఫార్మా, హెల్త్​, ఫుడ్​ ప్రాసెసింగ్​ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫార్మాసిటీపై ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని వివరించారు. ఒకేచోట ఫార్మాసిటీ కాకుండా ఫార్మా విలేజీలు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. స్పోర్ట్స్​, ఆటో మొబైల్​, ఆర్గానిక్​ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రక్షణ, నావికా రంగం పరికరాల తయారీకి అపార అవకాశాలు ఉన్నాయన్నారు. కొత్తగా సోలార్​ పవర్​ పాలసీని రూపొందిస్తామని హామీ ఇచ్చారు.

ఓఆర్​ఆర్​, హైవేలకు దగ్గరలో ఉండేలా ఫార్మా విలేజ్​లు ఏర్పాటు చేస్తామని, ఓఆర్​ఆర్​కు 14 రేడియల్​ రోడ్లు, 12 హైవేల కనెక్టివిటీ ఉంటుందన్నారు. ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా ఫార్మా పరిశ్రమలు ఉండేలా చూడాలన్నారు. కాలుష్యం లేకుండా పరిశ్రమలు, స్కూల్స్​, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వెల్లడించారు.

గత ప్రభుత్వం లాగా తాము యువతను భారంగా భావించటం పేర్కొన్నారు. పరిశ్రమల అభివృద్ధిలో యువత భాగస్వాములయ్యేలా చూస్తామన్నారు. యువతలో నైపుణ్యాల పెంపునకు స్కిల్స్​ యూనివర్సిటీలు పెడతామన్నారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు వెల్‌ స్పాన్ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. పరిశ్రమలకు తమ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.

You may also like

Leave a Comment