ఉత్తర్‌ప్రదేశ్ సీఎం(Uttar Pradesh CM) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కాన్వాయ్ (Convoy) ప్రమాదానికి గురైంది. లక్నోలో ఆయన వెళ్తున్న కాన్వాయ్‌కు ముందు యాంటీ డెమో వాహనం అదుపు తప్పింది. ఓ కుక్క అడ్డు రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీసులు, ఆరుగురు పౌరులు గాయపడినట్లు సమాచారం. అయితే, గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ నుంచి విమానంలో తిరిగి వచ్చి తన నివాసానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అర్జున్‌గంజ్ ప్రాంతంలోని మారి మాతా గుడి దగ్గరి నుంచి కారు వెళ్తుండగా అకస్మాత్తుగా దారిలో ఓ కుక్క అడ్డు వచ్చింది.
కుక్కను తప్పించే ప్రయత్నంలో వాహనం ఒక్కసారిగా ఆగి ఉన్న పౌర వాహనాన్ని ఢీకొట్టింది. లులు మాల్ వైపు వెళ్తున్న రెండో వాహనంలో ఐదుగురు ఉన్నారు. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులందరినీ ట్రామా సెంటర్‌కు తరలించారు. గాయపడిన వారిని సెహ్నాజ్, అక్సా, హస్నైన్, నవేద్, ముస్తకీమ్గా గుర్తించారు.
లక్నో డీఎంతో పాటు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్‌లు సివిల్ ఆసుపత్రికి చేరుకుని గాయపడిన పోలీసులు, క్షతగాత్రులను పరామర్శించారు. పోలీస్ కమిషనర్ లక్నో ఎస్పీ శిరాద్కర్, జాయింట్ పోలీస్ కమిషనర్ ఉపేంద్ర కుమార్ అగర్వాల్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం గాయపడిన మహిళలను ట్రామా సెంటర్‌కు తరలించారు.