Telugu News » CM YS Jagan: మీరే నా ధైర్యం.. చంద్రబాబులా ఎన్నడూ సాకులు చెప్పలేదు: సీఎం జగన్

CM YS Jagan: మీరే నా ధైర్యం.. చంద్రబాబులా ఎన్నడూ సాకులు చెప్పలేదు: సీఎం జగన్

పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్.. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబులా ఎన్నడూ సాకులు చెప్పలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదేవిధంగా ఎన్నికల్లో పొత్తుపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

by Mano

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(Cm jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్.. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబులా ఎన్నడూ సాకులు చెప్పలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదేవిధంగా ఎన్నికల్లో పొత్తుపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

CM YS Jagan: You are my courage.. Chandrababu never made excuses: CM Jagan

‘మీతోనే పొత్తు.. మీరే నా ధైర్యం.. మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా చూడండి అంటూ పిలుపునిచ్చారు.. పొత్తులను నమ్ముకోలేదు.. నా ధైర్యం మీరే..’ అని జగన్ తెలిపారు. ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలన్న జగన్.. పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని ప్రకటించారు. గత పాలకులు ప్రాజెక్టు చేపట్టగా.. అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశామని చెప్పారు.

పల్నాడులో తాగు, సాగు నీటి ఏద్దడి ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు జగన్. కృష్ణమ్మ పక్కనే ప్రవహిస్తున్నా గుక్కెడు నీళ్లు దొరకడం లేదని, పల్నాడు తల రాత మార్చాలని చేస్తున్న ప్రయత్నమే వరికిపూడిసెల ప్రాజెక్ట్ నిర్మాణం అని స్పష్టం చేశారు. ఏ అనుమతులు లేకుండా చంద్రబాబు ఎలా ప్రారంభం చేశారు..? అని నిలదీశారు. చిత్త శుద్ది, నిజాయితీ లేకుండా ప్రజలను మోసం చేసిన నాయకుడు చంద్రబాబుకు అందుకే 2019 లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు.. కేవలం 23 స్థానాలు ఇచ్చారని గుర్తుచేశారు.

పౌరుషాల గడ్డను అభివృద్ధికి అడ్డాగా మార్చాం.. పల్నాడును ప్రత్యేక జిల్లా చేశాం, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం అని జగన్ వెల్లడించారు. చంద్రబాబు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఓటు అడుగుతున్నాడని, కేజీ బంగారం, బెంజ్‌ కారు కూడా ఇస్తానంటాడని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. కన్నతల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అన్నట్లు సొంత నియోజకర్గం కుప్పంలో తాగు నీరు ఇవ్వలేని చంద్రబాబు, మన పల్నాడుకు మంచి చేస్తాడా? అని ప్రశ్నించారు.

కుప్పంకు నీళ్లు కావాలన్న, రెవెన్యూ డివిజన్ కావాలన్న చేసింది మీ బిడ్డ జగనేనని గుర్తుపెట్టుకోవాలని ప్రజలను కోరారు. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలకు వెన్నుపోటు పొడవం లెక్క కాదన్నారు. ‘ఎస్సీల్లో ఎవరైనా పుట్టాల అంటారా.., బీసీల తోకలు కట్టిరిస్తా..?’ అని అహంకార మాటలు చంద్రబాబువి అని మండిపడ్డారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలోనే రెండు లక్షల ఏడు వేలు ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్ వెల్లడించారు. ఉచిత విద్యుత్ అడిగితే ఆ రైతులను కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది అని, రైతులను మోసం చేసి గాలికి వడిలిన చంద్రబాబు ఇప్పుడు ఏదో చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలోకి రావాలని కల్ల బొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు.. నరమాంసం అలవాటు పడిన పులి బంగారు గాజులు నమ్మి వెళ్తే అంతే సంగతులు అని జగన్ ప్రజలకు సూచించారు.

You may also like

Leave a Comment