Telugu News » cable expo 2023: వరుసగా పదో ఏడాది కేబుల్‌ ఎక్స్‌పో!

cable expo 2023: వరుసగా పదో ఏడాది కేబుల్‌ ఎక్స్‌పో!

కేబుల్ రంగం కుదెలవుతున్న తరుణంలో కస్టమర్స్ కి, కేబుల్ ఆపరేటర్లకు అనుగుణంగా సేవలు అందిస్తున్నామని, డిజిటల్ విధానం వచ్చాక హెచ్‌డీ సేవలు అందుబాటులోకి తెచ్చామని

by Sai
cnc cable network expo

ప్రపంచ వ్యాప్తంగా కేబుల్‌ నెట్‌ వర్కింగ్‌ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా కేబుల్ ఆపరేటర్లు ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని స్థానిక కేబుల్‌ ఆపరేటర్లకు పరిచయం చేసే లక్ష్యంతో సీఎన్‌ఎసీ కేబుల్‌ ఎక్స్‌ పో 2023(cable expo 2023) హైదరాబాద్‌ హైటెక్స్‌ లో నిర్వహిస్తున్నారు.

cnc cable network expo

తెలుగు రాష్ట్రలలో ఉన్నటువంటి ప్రముఖ కేబుల్ నెట్వర్క్ సంస్థలు ఈ ఎక్స్ పో లో పాల్గొన్నారు. బీసీఎన్ కేబుల్ , ఎస్‌ఎస్‌సీ కేబుల్ నెట్వర్క్,జీటీపీఎల్‌ నెట్వర్క్, ఎస్‌ఎస్‌ఎల్‌సీ నెట్వర్క్, పలు డిజిటల్ నెట్ వర్క్ వాళ్ళు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెట్వర్కింగ్ లో విప్లవాత్మక మార్పులు వస్తుండడంతో ఆ దిశగా కేబుల్ ఆపరేటర్లు ముందడుగు వేయాలనే లక్ష్యంతో పదేళ్ల నుండి ఎక్స్ పో నిర్వహిస్తున్నారు.

హైటెక్స్ లో జరుగుతున్న కేబుల్ ఎక్స్ పోలో 150కిపైగా స్టాల్స్ లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించారు. తెలుగు రాష్ట్రాల్లోని కేబుల్ ఆపరేటర్ల అభివృద్ధే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఎక్స్ పో కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆపరేటర్లు పాల్గొని విజయవంతం చేస్తున్నారు.

డిజిటల్ దిశగా అడుగులు వేస్తున్నామని, సామాన్యునికి అందుబాటులో సిద్ధంగా ఉన్నామని ఐపి టీవీ, 4కె, హెచ్‌డీ సేవలతో పాటు ఫైర్ స్టిక్ సిస్టంకు కూడా తీసుకొచ్చామని బీసీఎన్‌ కేబుల్ నెట్వర్క్ ఎండి శ్రీనివాస్ రాజు అన్నారు. కస్టమర్స్ కు అనుగుణంగా అన్నిరకాల సేవలను ప్రారంభించామని, తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఆహ్లాదం వార్తలు అందజేయ్యడమే కాకుండా కస్టమర్స్ కి వినోదాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, కాలం అభివృద్ధి చెందుతున్న క్రమంలో కలనుకునంగా క్రమేపీ కొత్త సేవలు వస్తాయన్నారు బీసీఎన్‌ కేబుల్ నెట్వర్క్ ఎండీ శ్రీనివాస్ రాజు అన్నారు.

కేబుల్ రంగం కుదెలవుతున్న తరుణంలో కస్టమర్స్ కి, కేబుల్ ఆపరేటర్లకు అనుగుణంగా సేవలు అందిస్తున్నామని, డిజిటల్ విధానం వచ్చాక హెచ్‌డీ సేవలు అందుబాటులోకి తెచ్చామని, సామాన్యుడికి 100 శాతం వినోదం అందిస్తున్నామని ఎస్‌ఎస్‌సీ కేబుల్ నెట్వర్క్ అధినేతలు అంజిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లన్నారు.

సోషల్ మీడియా పెరుగుతున్న క్రమంలో అసత్యాలు ఎక్కువగా పెరిగాయని, ఫోన్ కి అతుక్కుపోతు ప్రపంచానికి మనుషులు దురమవుతున్నారని ఈ క్రమంలో కేబుల్ ఆపరేటర్లకి దన్నుగా నిలుస్తూ, కస్టమర్లకు 100శాతం వినోదాన్నిహెచ్‌డీ రూపకంగా చూపిస్తున్నామని ఎస్‌ఎస్‌సీ కేబుల్ అధినేతలు అంజిరెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

నూతన విధానానికి నాంది పలుకుతూ, డిజిటలైజ్ అయ్యాక హెచ్‌ డీ సేవలను అందిస్తున్నామని ఏసియన్ నెట్ ప్రతినిధి సత్య అన్నారు. ఏషియన్ నెట్ ద్వారా కేబుల్ టీవీ ప్రసారాలే కాకుండా ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవలు కూడా అందిస్తున్నామని ఏషియన్ నెట్ కేబుల్ ప్రతినిధి తెలిపారు.

కేబుల్ ఆపరేటర్స్ కి దన్నుగా నిలుస్తూ, కస్టమర్లకు వినోదాన్ని అందించేందుకు ముందుకొస్తు హెచ్‌డీ,4కె సేవలను ఎస్‌ఎస్‌ఎల్‌సీ యాప్ ద్వారా అందిస్తున్నామని ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఎండి కిషోర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వినోదాన్ని లైవ్ ద్వారా వీక్షించేందుకు ఎంతో ఉపయోగకరం అని, లైవ్, వినోదాలు, వార్తలు సమగ్ర వివరాలు లైవ్, రికార్డ్ లైబ్రరీ సౌకర్యం ఉందని ఈ యాప్ ద్వారా కస్టమర్లు ఆనందంగా ఉపయోగించుకుంటారని కిషోర్ అన్నారు.

You may also like

Leave a Comment